మిళ హాస్య నటుడు సంతానం ఇటీవల స్విమ్మింగ్ పూల్ పక్కన సేదతీరుతున్న పులి పక్కన కూర్చున్న ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఆయన పులి పక్కన కూర్చున్నాడు, దాని తోక పట్టుకొని ఆడుతున్నట్టు కనిపిస్తోంది. సంతానం పక్కనే ఉన్న సిబ్బందిని ఈ పులి పడుకుందా అని అడిగితే.. అతను కర్రతో కొట్టి దాన్ని నిద్ర లేపుతున్నాడు, ఆ పులి బాగా అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఆ వీడియో తో పాటు ‘దీనినే టైగర్ క్యాచింగ్ ఇట్స్ టైల్ అని అంటారు’ అంటూ క్యాప్షన్ ను కూడా రాసుకొచ్చాడు సంతానం.


ఆ పోస్ట్ పెట్టిన కొద్ది నిమిషాలకే ఆయనపై విమర్శలు మొదలుపెట్టారు నెటిజన్స్. నిద్రిస్తున్న పులిని హింసించడం సరైంది కాదు అని, ఆ పోస్ట్ ను డిలీట్ చేయాలని కామెంట్లు చేశారు. అయినా సంతానం ఆ పోస్ట్ ను డిలీడ్ చేయలేదు. గత కొన్ని రోజులుగా ట్విట్టర్ లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా ఈ పోస్ట్ పై ప్రముఖ టీవీ యాంకర్, నటి రష్మి గౌతమ్ కూడా స్పందించింది. 


 ‘‘కనీసం మీకు ఆ నీరసించిన పులి మీద కొంచెం కూడా జాలి లేదా? మత్తులో ఉన్న ఆ పులి కర్రతో కొట్టడం వల్ల అది ఉలిక్కిపడి లేచింది. అది నీరసంగా ఉన్నంత మాత్రాన్న మీరు బలవంతుడు అయిపోతారా లేదా మీకు మనసన్నదే లేదా’’ అంటూ కౌంటర్ ఇచ్చింది రష్మి. దీంతో ఆమె చేసిన రీట్వీట్ కు  నెటిజన్స్ బాగా చెప్పారు మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇన్ని విమర్శలు వస్తున్నా నటుడు సంతానం కనీసం వివరణ కూడా ఇవ్వకపోవడం గమనార్హం.


Also Read : 'గ్యాంగ్ లీడర్'లో ఎస్పీగా నటించిన వల్లభనేని జనార్ధన్ మృతి - ఆయన బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసా?






ఇక సంతానం టీవీ రంగంలో కమెడియన్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేశాడు. తర్వాత మెల్లగా సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. తమిళ్ లో వచ్చిన ‘మన్మధన్’, ‘సచిన్’, ‘పొల్లాధవన్’సినిమాల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత వరుసగా సినిమా అవకాశాలు తలుపుతట్టాయి. అనేక తమిళ్ చిత్రాల్లో కమెడియన్ గా సహ నటుడిగా నటించి మెప్పించాడు సంతానం. 2013 లో వచ్చిన ‘కన్న లడ్డు తిన్న ఆశయ్యా’ సినిమాతో నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత పలు సినిమాలను నిర్మించాడు. అనేక సినిమాల్లో హీరోకు ఫ్రెండుగా, అలాగే కీలక పాత్రల్లో నటించాడు. ఇక ఇటీవల సంతానం వరుసగా మెయిన్ లీడ్ క్యారక్టర్ ఉన్న సినిమాలే చేస్తున్నాడు. అయితే ఆయన హీరో గా చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. సబాపతి, డికిలోనా, పారిస్ జయరాజ్, బిస్కత్, తగల్ది వంటి చిత్రాలు విజయం సాధించలేదు. రీసెంట్ గా రత్న కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘గులు గులు’ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.