Anchor Rashmi Gautam: రష్మి గౌతమ్. తెలుగు సినిమా అభిమానులకు, బుల్లితెర వ్యూవర్స్ కు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఓవైపు యాంకర్ గా స్మాల్ స్క్రీన్ మీద అదరగొడుతూనే, మరోవైపు ఛాన్స్ వచ్చినప్పుడల్లా

  సినిమాలు చేస్తూ బిగ్ స్క్రీన్ పై అలరిస్తోంది. సినిమాల్లోనూ గ్లామరస్ క్యారెక్టర్స్ తో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మి.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలతో అభిమానులను అలరిస్తుంది. వ్యక్తిగత, సామాజిక విషయాల గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటుంది. ఎక్కువగా మూగ జీవాల గురించి మాట్లాడుతుంది.  


రష్మిపై నెటిజన్ అభ్యంతరకర వ్యాఖ్యలు


ఇక గత కొంత కాలంగా రష్మిక హిందూ సనాతన ధర్మం గురించి సోషల్ మీడియాలో  పోస్టులు పెడుతోంది. హిందూ మతం, దాని ఔన్నత్యం గురించి రాసుకొస్తుంది.  అయితే, కొందరు నెటిజన్లు ఆమె పోస్టులపై వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై ఆమె సమాధానం కూడా ఘాటుగానే ఇస్తోంది. తాజాగా అయోధ్య రామ మందిరం ప్రారంభంపై ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేసింది. దీనికి ఓ నెటిజన్ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. “అసభ్యకర పనులన్నీ చేసి కాషాయ చీర కట్టుకుని దేవుడి పేరును జపిస్తే చేసిన పాపాలన్నీ పోతాయా?” అని ప్రశ్నించాడు.


నెటిజన్ ప్రశ్నకు రష్మి తీవ్ర ఆగ్రహం


నెటిజన్ చేసిన కామెంట్ పై యాంకర్ రష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ఎలాంటి సంఘవిద్రోహ పనులు చేయలేదని వెల్లడించింది. “నేను ఏమైనా డబ్బులు ఎగవేశానా? కుటుంబ బాధ్యతలను మరిచానా? తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేశానా? ట్యాక్సులు కట్టడం లేదా? మీ దృష్టిలో… పనులు అంటే ఏంటి? ఈ మధ్య కాలంలో ఇలాంటి మాటలు మరీ ఎక్కువగా వింటున్నాను. నా వరకు భవవంతుడు సర్వాంతర్యామి. సనాతన ధర్మంలో మంచి విషయమే అది” అని ఘాటుగా రిఫ్లై ఇచ్చింది.






రష్మి రీసెంట్ గా ‘బాయ్స్ హాస్టల్’ అనే సినిమాలో నటించింది. కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్టయిన 'హాస్టల్ హుడుగురు బేకాగిదరే' చిత్రాన్ని 'బాయ్స్ హాస్టల్' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో రష్మీ గెస్ట్ రోల్ పోషించింది. లెక్చరర్ పాత్రలో కనిపించింది. 'భోళా శంకర్'లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించింది.


Read Also: ‘హనుమాన్‘లో ఆ పాత్ర కోసం ‘కాంతార‘ స్టార్, అసలు విషయం చెప్పేసిన ప్రశాంత్ వర్మ