Prasanth Varma: ‘హనుమాన్‘లో ఆ పాత్ర కోసం ‘కాంతార‘ స్టార్, అసలు విషయం చెప్పేసిన ప్రశాంత్ వర్మ

Prasanth Varma: ‘హనుమాన్‘ మూవీలో విభీషణుడి పాత్రకు తొలుత రిషబ్ శెట్టిని అనుకున్నారట దర్శకుడు ప్రశాంత్ వర్మ. కానీ, కొన్ని కారణాలతో సముద్ర ఖనిని తీసుకోవాల్సి వచ్చిందట.

Continues below advertisement

Prasanth Varma About Rishab Shetty: చిన్న సినిమాగా విడుదలై దేశ వ్యాప్తంగా పెద్ద విజయాన్ని అందుకున్నది ‘హనుమాన్’. యంగ్ హీరో తేజ సజ్జ, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా తొలి షో నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు అద్భుతం అంటున్నారు. రోజు రోజుకు ప్రేక్షకుల సంఖ్య పెరగడంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ మూవీ విడుదలైన 10 రోజుల్లోనే రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అంతేకాదు, థియేటర్ల సంఖ్యతో పాటు కలెక్షన్స్ కూడా భారీగా పెరుగుతున్నాయి.  

Continues below advertisement

విభీషణుడి పాత్రకు రిషబ్ శెట్టిని అనుకున్నా!

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శఖుడు ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ మూవీలోని నటీనటులకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో విభీషణుడి పాత్ర చాలా కీలకంగా నిలిచింది. కొద్దిసేపే కనిపించినా, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కథను మలుపు తిప్పడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ పాత్రలో సముద్ర ఖని అద్భుతంగా నటించారు. అయితే, వాస్తవానికి ఈ పాత్రకు ఆయన ఫస్ట్ ఛాయిస్ కాదట. ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టిని తీసుకోవాలి అనుకున్నారట. ఇదే విషయాన్ని ప్రశాంత్ వర్మ రిషబ్ శెట్టికి చెప్పారట. ఆయనకు ఈ పాత్ర బాగా నచ్చినా, ‘కాంతార’ సినిమా ప్రమోషన్స్ లో బిజీ కావడంతో చేయలేకపోయారట. ఆ తర్వాత ఈ పాత్రలకు సముద్ర ఖనిని ఎంపిక చేశారట. ‘హనుమాన్’ సినిమాలో చేయకపోయినప్పటికీ ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అవుతానని ప్రామీస్ చేశారట. సో, ప్రశాంత్ తర్వాత సినిమాలో రిషబ్ శెట్టి కచ్చితంగా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు తెలియడంతో రిషబ్ ఫ్యాన్స్ సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ తదుపరి చిత్రాల్లో రిషబ్ కు ఎలాంటి పాత్ర ఇస్తారో? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  

‘హనుమాన్’ సినిమాపై రిషబ్ శెట్టి ప్రశంసలు

అటు ఇప్పటికే ‘హనుమాన్’ సినిమాపై రిషబ్ శెట్టి ప్రశంసలు కురిపించారు. ‘హనుమాన్’ సినిమా చూసిన ఆయన, ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ, నటుడు తేజ సజ్జను పొగడ్తలలో ముంచెత్తారు. “హనుమాన్.. దర్శకుడు ప్రశాంత్ వర్మ స్టోరీ చెప్పే విధానం అద్భుతంగా ఉంది. తేజ సజ్జ నటన సైతం చాలా బాగుంది. ఆయన నటన చాలా కాలం వరకు ప్రేక్షకులకు గుర్తుంటుంది” అని తన ట్వీట్ లో వెల్లడించారు.  ‘కాంతార’ మాదిరిగానే ‘హనుమాన్’ సైతం బ్రహ్మాండమైన విజయాన్ని సాధించిందంటూ నెటిజన్లు ప్రశంసించారు. రిషబ్ శెట్టి చివరగా ‘కాంతార’ సినిమాలో కనిపించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీక్వెల్ షూటింగ్ కొనసాగుతోంది.  

Read Also: డబ్బు కోసం ఆమె నన్ను పెళ్లి చేసుకోలేదు, పవిత్రలో ఆ లక్షణాలు చూశా: నరేష్

Continues below advertisement
Sponsored Links by Taboola