నిత్యం ఏవో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంటారు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా నిర్మాతల సమ్మెపై ఆయన ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నిర్మాతలకి అసలైన శత్రువులు ఓటీటీలు, థియేటర్లు కాదు, రాజమౌళి’’ అని అన్నారు.


“సినిమా ఇండస్ట్రి ఇలా అవడానికి మూల కారణం ఒక వ్యక్తే. అతనే రాజమౌళి. ఇండస్ట్రీకి సంబంధించి రాజమౌళి రెండు తప్పులు చేశాడు. సినిమా బాగా తీస్తే రూ.2 వేల కోట్లు కూడా వస్తాయని నిరూపించాడు. రెండోది క్వాలిటీ, ఎంటర్ టైన్మెంట్. రాజమౌళి తీసిన బెంచ్ మార్క్ ని మిగతా వాళ్ళు అందుకోలేకపోతున్నారు. పాన్ ఇండియా సినిమాలు తీస్తుంటే నిర్మాతలు అంతకంటే గొప్పగా తియ్యాలని అనుకుంటున్నారు. దాని వల్ల కాస్ట్ ప్రొడక్షన్ ఎక్కువగా మారుతుంది. హీరోలు ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతున్నారు. కొంతమంది నిర్మాతలు గత్యంతరం లేక ఖర్చు పెడుతున్నారు” అని అన్నారు.


“షూటింగ్స్ ఆపేసి మరి నిర్మాతలు ఎందుకు సమ్మె చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఓటీటీల మూలంగా ప్రేక్షకులు థియేటర్లకి రావడం లేదని అంటున్నారు. కానీ ఓటీటీ వాళ్ళేమో మాకు చందాదారులు పెరగడం లేదని అంటున్నారు. కానీ ఇవి రెండింటికీ కారణం ఒకటే అది యూట్యూబ్. జనాలకి ఎంటర్ టైన్మెంట్ ఎక్కడ వస్తుందా అని చూస్తున్నారు, అది యూట్యూబ్ లో దొరుకుతుంది. అలాంటప్పుడు రెండు గంటలు వెచ్చించి ప్రేక్షకులు సినిమా చూడటానికి ఆసక్తి చూపించడం లేదు. యూట్యూబ్ లో అయితే అన్ని ఉంటున్నాయి. వార్తలు, సినిమా సాంగ్స్ అన్ని అందుబాటులో ఉంటున్నాయి’’ అని ఆర్జీవీ అన్నారు.


‘‘ఇంకొక శత్రువు సోషల్ మీడియా. యూట్యూబ్, సోషల్ మీడియా కారణంగానే జనాలకి సినిమాల మీద ఆసక్తి తగ్గుతుంది. వాళ్ళకి కావాల్సిన ఎంటర్ టైన్మెంట్ అందులో దొరుకుతుంది. సగం మంది సినిమాలను చూడటం తగ్గించి సోషల్ మీడియా మీద పడుతున్నారు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ లో రాజమౌళి, కే జీ యఫ్ బెంచ్ మార్క్ ని రీచ్ అవడం ఎవరి వల్ల సాద్యం కావడం లేదు. అంతగా ఖర్చు పెడితే అవుతుందా లేదా తగ్గిద్దామంటే అసలు జనాలు వస్తారో లేదో అనే డౌట్ కూడా వస్తుంది. రాజమౌళి ఇచ్చిన కంటెంట్ చూసిన తర్వాత మిగతావి చూసేందుకు ఇష్టం చూపించడం లేదు. రాజమౌళి, యూట్యూబ్ సినిమా ఇండస్ట్రీకి ఉన్న అతిపెద్ద శత్రువులు. రాజమౌళి అణుబాంబు అయితే యూట్యూబ్ మిషన్ గన్. జనాలు నిద్ర లేవగానే ఓటీటీ ఓపెన్ చెయ్యరు, యూట్యూబ్ చూస్తారు” అందుకే అవే శత్రువులు అని రాం గోపాల్ వర్మ అన్నారు.


తెలుగు సినిమాల ప్రొడక్షన్ కాస్ట్ రోజురోజుకి పెరిగిపోతుంది. బడ్జెట్ అనేదానికి లిమిట్ లేకుండా పోతుంది. హీరోలు, దర్శకులు రెమ్యునరేషన్స్ పేరుతో కోట్లు వసూలు చేస్తున్నారు. దర్శకుడు పెర్ఫెక్షన్ పేరుతో రీషూట్స్ చేయడం నిర్మాతలకు అదనపు భారంగా మారింది. అందుకే టాలీవుడ్ నిర్మాతలు బంద్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.  


Also Read: తెలుగులో హీరోలు లేరా? మలయాళం నుంచి రావాలా? - దుల్కర్‌పై సంతోష్ శోభన్ షాకింగ్ కామెంట్స్


Also Read: మళ్ళీ నిఖిల్‌ను వెనక్కి పంపారు - ఆగస్టు 12న కాదు, తర్వాత రోజున 'కార్తికేయ 2'