టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి ఇదివరకే హీరోగా పరిచయమయ్యారు. కానీ హిట్టు కొట్టలేకపోయారు. తొలిసారి ఆయన 'రొమాంటిక్' సినిమాతో హిట్ అందుకున్నారు. అనిల్ పాదూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి కథ-మాటలు-స్క్రీన్ ప్లే పూరి జగన్నాథ్ అందించడం విశేషం. అంతేకాదు.. పూరి తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా కోసం ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేశారు. 


ప్రభాస్ తో ఇంటర్వ్యూ చేయించడంతో పాటు.. రెండురోజుల ముందే సెలబ్రిటీ ప్రీమియర్ షోలను నిర్వహించారు. రాజమౌళి లాంటి అగ్ర దర్శకులు ఈ ప్రీమియర్ కి హాజరై సినిమాకి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూత్ ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యారు. కొన్ని సన్నివేశాల్లో ఆకాష్ పూరి పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉందని చెబుతున్నారు. ఇక హీరోయిన్ కేతికా శర్మ తన గ్లామర్ షోలో వెండితెరను షేక్ చేసిందట.


Also Read: 'రొమాంటిక్' సమీక్ష: రొమాన్స్ తక్కువ... రొటీన్ సీన్లు ఎక్కువ!


ఈ సినిమా చూసిన సినీ సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా ఈ సినిమాకి రివ్యూ ఇచ్చేశారు. రొమాంటిక్ భాషలో కంగ్రాట్స్ చెప్పిన వర్మ.. ఆకాష్ పూరిని రొమాంటిక్ థండర్ స్టార్ గా.. కేతిక శర్మను రొమాంటిక్ హాట్ బ్యూటీ అంటూ కొనియాడారు. వీరిద్దరూ కూడా తమ కెమిస్ట్రీతో బాక్సాఫీస్ ను బర్న్ చేశారని.. ఇలాంటి సినిమాను రూపొందించిన దర్శకుడు అనీల్ పాదూరి, నిర్మాతలు పూరి, ఛార్మిలకు సెల్యూట్ చెప్పారు. 


ఈ ట్వీట్ పై స్పందించిన హీరోయిన్ కేతిక శర్మ.. వర్మకు థాంక్స్ చెప్పింది. దానికి వర్మ.. 'హే కేతికా.. మాకు హాట్ అండ్ రొమాంటిక్ ఫీల్ తెప్పించిన నీకు.. నేను ఆడియన్స్ థాంక్స్ చెప్పాలి' అంటూ రిప్లై ఇచ్చాడు. 








Also Read: తన కళ్లను దానం చేసిన పునీత్.. ఎమోషనల్ అవుతోన్న ఫ్యాన్స్..


Also Read: పునీత్‌కు హార్ట్ఎటాక్?.. అతిగా జిమ్ చేస్తే గుండె ఆగుతుందా? అసలేం జరిగింది?


Also Read: నోట మాట రాలేదు... పునీత్ మరణంపై మెగాస్టార్ చిరంజీవి


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి