మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' తరువాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూణే, హైదరాబాద్, రాజమండ్రిలలో చిత్రీకరించారు. సగానికి పైగా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. 


ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ని ఒక్కొక్కటిగా రివీల్ చేయబోతున్నారు. ఇందులో భాగంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆగస్టు 15న టైటిల్ తో పాటు విడుదల చేయనున్నారు. ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా టైటిల్ ను ప్రకటించబోతున్నారు. ఈ ఈవెంట్ కోసం చాలా మంది స్పెషల్ గెస్ట్ లను తీసుకురాబోతున్నారు దర్శకుడు శంకర్. 


ఈ సినిమాకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. ఇందులో నటుడు ఎస్ జె సూర్య ముఖ్యమంత్రి కొడుకుగా.. మెయిన్ విలన్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. అధికారం, డబ్బు కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనుకడుగు వేయని పాత్ర అది. ఈ అన్యాయాలను ఎదుర్కోవడానికి ఒక ఐఏఎస్ అధికారి పాత్రలో చరణ్ పోరాడే సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలువనున్నాయి.


షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా అక్టోబర్ నాటికి పూర్తవుతుందని అంటున్నారు. శ్రీకాంత్, అంజలి, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర వంటి తారలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యహరించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. 


Also Read : 'ఆర్ఆర్ఆర్'లో పులితో ఎన్టీఆర్ ఫైట్ - వీఎఫ్ఎక్స్‌కు ముందు, తర్వాత


Also Read : అది పాస్తా వల్ల వచ్చిన కడుపు, ప్రెగ్నన్సీ కాదు - రూమర్లకు చెక్ పెట్టిన కరీనా కపూర్