Ram Charan 15: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్-శంకర్ సినిమా వచ్చేది ఆ రోజే.. ‘దిల్’ రాజు వెల్లడి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో 'దిల్' రాజు, శిరీష్ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో 'దిల్' రాజు చెప్పారు.

Continues below advertisement

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా సౌతిండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌ (Shankar Shanmugam) తో ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు, శిరీష్ ఓ పాన్ ఇండియా సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అడ్వాణీ (Kiara Advani) కథానాయిక. హీరోగా రామ్ చరణ్ 15వ సినిమా ఇది (RC15). శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పతాకంపై 'దిల్‌' రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 50వ చిత్రం ఇది. ఈ శుక్రవారం (జనవరి 14న) 'రౌడీ బాయ్స్' రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో చెప్పారు.

Continues below advertisement

వచ్చే ఏడాది సంక్రాంతికి (Pongal 2023) రామ్ చరణ్, శంకర్ సినిమాను విడుదల చేయాలని అన్నట్టున్న 'దిల్' రాజు వెల్లడించారు. ఓ ఏడాది ముందే సంక్రాంతి మీద కర్చీఫ్ వేశారన్నమాట. పాన్ ఇండియా సినిమా కాబట్టి... ముందుగా అన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యవస్థ, ఉద్యోగులు నేపథ్యంలో ఆ సినిమా తెరకెక్కుతోంది. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేశారు. కొంత షూటింగ్ కూడా చేశారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్‌, జ‌య‌రామ్‌, న‌వీన్ చంద్ర‌, సునీల్‌, అంజ‌లి ముఖ్య తారాగణం. తిరుణ్ణావుక్క‌ర‌సు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వరిస్తున్నారు.

అన్నీ బావుంటే ఈ ఏడాది సంక్రాంతికి 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాతో రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు. కరోనా, ఓమైక్రాన్ వ్యాప్తి ఎక్కువ ఉండటంతో 'ఆర్ఆర్ఆర్'ను వాయిదా వేశారు. ఈ ఏడాది సంక్రాంతి మిస్ అయినా... నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రామ్ చరణ్ వస్తాడనే వార్త మెగా అభిమానులకు సంతోషాన్ని కలిగించేదే. గతంలో 'నాయక్', 'ఎవడు' సినిమాలను సంక్రాంతికి విడుదల చేసి రామ్ చరణ్ విజయాలు అందుకున్నారు. అందులో 'ఎవడు' సినిమాకు 'దిల్' రాజు నిర్మాత.

Also Read: ‘మనం’ హిందీలో చేయకపోవడానికి కారణం అదే.. వాళ్లిద్దరూ కుట్ర పన్నారు.. నాగార్జున ఇంటర్వ్యూ
Also Read: ‘ఆ నొప్పిని భరిస్తూ..’ తమ్ముడు వైష్ణవ్‌కు విషెస్ చెబుతూ.. సాయి ధరమ్ తేజ్ భావోద్వేగం
Also Read: ఏపీలో టికెట్ రేట్స్‌తో మాకు స‌మ‌స్య‌ లేదని ఎందుకు అన్నానంటే.. నాగార్జున వివరణ!
Also Read: త్రివిక్ర‌మ్ గారూ... ఆ సీన్ యూట్యూబ్‌లో రిలీజ్ చేయండి!
Also Read: మొన్న 'RRR'.. ఇప్పుడు 'BBB'.. క్రేజీ మల్టీస్టారర్ సెట్ అవుతుందా..?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement