మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమాను(RC15) రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' తరువాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తరువాత 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయాలనుకున్నారు చరణ్. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.
కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. చరణ్-గౌతమ్ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. దానికి చాలా కారణాలే ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా గౌతమ్ తిన్ననూరి ఇచ్చిన ఫైనల్ నేరేషన్ తో చరణ్ సంతృప్తి చెందలేదట. పైగా ఈ సినిమాకి భారీ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఉండడం.. పాన్ ఇండియా సబ్జెక్ట్ ని గౌతమ్ ఎలా హ్యాండిల్ చేయగలడనే సందేహాలతో ఇప్పుడు ఈ సినిమాను పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది.
Ram Charan's 16th Project Locked: ఇప్పుడు ఈ సినిమాకి బదులుగా మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు రామ్ చరణ్. కొన్ని నెలలుగా చరణ్ ను కలిసి కథలు వినిపిస్తున్నారు దర్శకులు. ఈ క్రమంలో కన్నడ దర్శకుడు నర్తన్ చెప్పిన కథ చరణ్ కి బాగా నచ్చిందట. 'మఫ్తి' అనే సినిమాతో కన్నడలో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు నర్తన్. చాలా కాలంగా ఆయన చరణ్ తో సినిమా చేయాలనుకుంటున్నారు. ఫైనల్ గా కథ సెట్ అవ్వడంతో చరణ్ కి వినిపించారు. ఆయన ఓకే చెప్పడంతో.. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఫైనల్ నేరేషన్ ఇచ్చారు నర్తన్. కథ ఇంప్రెసివ్ గా అనిపించడంతో చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనుంది. మొత్తానికి చరణ్ తన నెక్స్ట్ సినిమాను లైన్ లో పెట్టబోతున్నారన్నమాట!
ఇక చరణ్ 'RC15' సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలనేది శంకర్ ప్లాన్. కానీ సడెన్ గా ఆయన 'ఇండియన్ 2' సినిమాను రీస్టార్ట్ చేయడంతో చరణ్ సినిమాను పక్కన పెట్టినట్లు వార్తలొచ్చాయి. మొన్నామధ్య ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు శంకర్. 'ఇండియన్ 2', 'RC15' సినిమాలను సమాంతరంగా చిత్రీకరించబోతున్నట్లు చెప్పారు. చరణ్ సినిమా కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ మొదటి వారంలో స్టార్ట్ చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్, వైజాగ్ లలో సినిమాను చిత్రీకరించబోతున్నట్లు చెప్పారు.
ఒకేసారి శంకర్ రెండు భారీ ప్రాజెక్ట్స్ ను టేకప్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. చరణ్ అభిమానులు తమ హీరో సినిమా క్వాలిటీ దెబ్బ తింటుందేమోనని భయపడుతున్నారు. కానీ శంకర్ మాత్రం తన సినిమాలను తెరకెక్కించే విషయంలో ఫుల్ క్లారిటీతోనే ఉన్నట్లు ఉన్నారు. మరి ఈ సినిమాల రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి!
Also Read : 'ఒకే ఒక జీవితం' రివ్యూ : టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ & మదర్ సెంటిమెంట్ శర్వాకు హిట్ ఇచ్చాయా?