ఆదివారం నాడు ఉదయం 3 గంటల సమయంలో బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ లో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు జరిపారు. ఈ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారని తెలుసుకున్న పోలీసులు పబ్ పై దాడి చేసి దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు.  వారిలో పలువురు ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీకి చెందిన నీహారిక కొణిదెల, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉండడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. 


నీహారిక ఈ పార్టీలో ఉన్నందున నాగబాబు స్వయంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో తన కూతురు ఎలాంటి తప్పు చేయలేదని.. పోలీసులు కూడా అదే విషయం చెప్పారని తెలిపారు. ఇక తాజాగా రాహుల్ సిప్లిగంజ్ ఓ మీడియా ఛానెల్ కు ఈ పార్టీ విషయంపై ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో పలు ప్రశ్నలను సమాధానాలు చెప్పారు. 


ఫ్రెండ్స్ పార్టీ ఉంటే వెళ్లానని.. మా టేబుల్ దగ్గర మేం ఫన్ చేసుకుంటూ ఉన్నామని చెప్పారు రాహుల్. రాత్రి 1:30 సమయంలో పబ్ నుంచి వెళ్లిపోయే టైమ్ లో పోలీసులు ఆపారని.. ఎందుకని ప్రశ్నిస్తే సమాధానమివ్వలేదని.. ఆ తరువాత 150, 200 మందిని స్టేషన్ కి తీసుకెళ్లారని రాహుల్ చెప్పారు. సమయానికి మించి పబ్ నడిపితే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి కానీ అడ్డంగా దొరికానని తనపై వార్తలు రాస్తున్నారని వాపోయారు.


ఈ విషయంలో తన స్నేహితులు, ఫ్యామిలీ చాలా టెన్షన్ పడ్డారని చెప్పుకొచ్చారు. తనకసలు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని.. ఏ టెస్టుకైనా సిద్ధమని అన్నారు. డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొన్నానని.. డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదని.. ఇప్పటివరకు చూడలేదని చెప్పుకొచ్చారు. 


Also Read: రేవ్ పార్టీపై టాస్క్‌ఫోర్స్ దాడులు - బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అరెస్ట్