TS LAWCET 2022: తెలంగాణ లాసెట్‌ 2022 నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 2న వచ్చేసింది. మూడు, ఐదేళ్ల లా కోర్సులతోపాటు ఎల్‌ఎల్‌ఎం కోర్సు (LLM Course 2022)లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ నోటిఫికేషన్‌ ను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి, వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ వెంకటరమణ, కేయూ వీసీ ప్రొఫెసర్‌ తాటికొండ రమేశ్‌, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాస్‌రావు, లాసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జీబీ రెడ్డి విడుదల చేశారు. 2022-23 విద్యా సంవత్సరం లా సెట్‌ షెడ్యూల్‌ షెడ్యూల్ ఇది. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే.. దరఖాస్తుదారులకు ఎలాంటి వయో పరిమితి ఉండదు. ఎవరైనా ఎంట్రన్స్ రాయవచ్చు.


తెలంగాణ రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి 3, 5 ఏళ్ల లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్  ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 6 న ప్రారంభమై జూన్‌ 6న ముగియనుంది. ఎల్‌ఎల్‌బీకి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500, ఇతరులకు రూ.1000లు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్య రుసుంతో రూ.500 నుంచి రూ.2 వేల వరకు జులై 12 వరకు అప్లికేషన్స్ సబ్మిట్ చేయవచ్చు. జూన్ 21, 22 తేదీల్లో పరీక్షలు నిర్వహించడానికి షెడ్యూల్ చేశారు. ఎల్‌ఎల్‌బీలో ప్రవేశానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీ (10+2+3 pattern)లో జనరల్, బీసీ, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు వరుసగా 45, 42, 40 శాతం మార్కులను అర్హతగా పరిగణిస్తారు.


జనరల్, బీసీ, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌లో 45%, 42% మరియు 40% కంటే తక్కువ మార్కులు వచ్చినట్లయితే, ఆ అభ్యర్థులు ఇదే శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులను పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా B.Ed లో తెచ్చుకుంటే మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు అర్హులు అవుతారు.  పూర్తివివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://lawcet.tsche.ac in లో చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.


Note:
అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సబ్మిట్ చేయకూడదని సూచించారు. ఎవరైనా అభ్యర్థి ఎక్కువ అప్లికేషన్స్ సబ్మిట్ చేసినట్లయితే.. వారి అన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ చేయవచ్చు. లేదా ఏదైనా ఒక్క అప్లికేషన్ ఓకే చేసే ఛాన్స్ ఉంది. 



5 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు..
5 సంవత్సరాల LLBకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రెండేళ్ల ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్
10+2  లేదా ఇతర సమాన పరీక్ష, కోర్సులో సంబంధిత విశ్వవిద్యాలయం లేదా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి జనరల్, బీసీ, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 45% , 42%, 40% శాతంతో ఉత్తీర్ణత సాధిస్తే ఈ కోర్సుకు అర్హులుగా పరిగణిస్తారు. 


ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు వివరాలు
TS LAWCET – 2022 కోసం : రూ.800 (SC/ST & PH అభ్యర్థులు రూ.500 ) చెల్లించాలి
TS PGLCET కోసం – 2022 : రూ.1000   (SC/ST & PH అభ్యర్థులు రూ.800) చెల్లించాలి


ముఖ్యమైన తేదీలు
1. ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్‌కు ప్రారంభ తేదీ : 06-04-2022
2. అప్లికేషన్లకు చివరి తేదీలు
ఎ) ఎలాంటి ఆలస్య రుసుము (Without Late Fee) లేకుండా : 06-06-2022
బి) రూ.500 ఆలస్య రుసుముతో : 26-06-2022
సి) రూ.1,000 ఆలస్య రుసుముతో : 05-07-2022
డి) రూ.2,000 ఆలస్య రుసుముతో : 12-07-2022 వరకు అప్లై చేసుకోవచ్చు.


Also Read: TS CET Test: తెలంగాణలో కామన్ ఎంట్రన్స్ టెస్టు తేదీలు ఇవే


Also Read: CUET Exam: సీయూఈటీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ - ఎగ్జామ్ సిలబస్‌పై యూజీసీ ఛైర్మన్ క్లారిటీ