తెలంగాణలో కామన్ ఎంట్రన్స్ టెస్టు తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. లాసెట్ మూడేళ్ల కోర్సు సహా ఇతర సెట్‌ల ప్రవేశ పరీక్ష తేదీల వివరాలు ఇలా ఉన్నాయి. ఐసెట్ మినహా మిగతావాటిని ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహిస్తోంది.
మూడేళ్ల లా కోర్సుకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్టును జులై 21న నిర్వహిస్తారు. ఐదేళ్ల లా సెట్‌కు సంబంధించిన ప్రవేశ పరీక్షను జులై 22న నిర్వహిస్తారు. పీజీఎల్‌సెట్ కూడా అదే రోజు ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆ సెట్ కన్వీనర్ వెల్లడిస్తారు.
బీఈడీ సెట్ కూడా జులైలో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి తేల్చింది. జులై 26, 27 రెండు రోజుల పాటు బీఈడీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అప్పుడే ఐసెట్ కూడా ఉంటుంది. దీన్ని కూడా రెండు రోజుల పాటు జరపనున్నారు. జులై 27-28 తేదీల్లో ఐ సెట్ ఉంటుంది. దీన్ని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తారు.
ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు కోసం నిర్వహించే పీజీఈసెట్ ను జులై నుంచి ఆగస్టు వరకు జరపనున్నారు. జులై 29 నుంచి ఆగస్టు 1వరకు ఈ పరీక్ష ఉంటుంది. ఈసెట్‌లలో ఒక్క ఐ సెట్ మినహా మిగిలిన సెట్‌లన్నీ కూడా ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన కన్వీనర్‌లను నియమించున్నాయి ఆయా యూనివర్శిటీలు.