CUET 2022 Exam completely based on class 12 syllabus - యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్ జగదీశ్ కుమార్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సీయూఈటీ (CUET 2022 Exam)పై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ పరీక్షలో 12వ తరగతికి సంబంధించిన సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయని, 11వ తరగతి సిలబస్ నుంచి ఒక్క ప్రశ్న కూడా ఇవ్వడం లేదని UGC Chief Jagadesh Kumar స్పష్టం చేశారు.
బోర్డ్ ఎగ్జామ్స్‌ను సీయూఈటీ అస్తవ్యస్తంగా మార్చే ప్రయత్నం చేయదని పీటీఐటీతో మాట్లాడుతూ అన్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం సరైన నిర్ణయాలనే తీసుకుంటామని, సంస్థలు అదే దిశగా అడుగులు వేస్తాయని చెప్పారు. ఏప్రిల్ 2 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ (Application Date For CUET 2022 Exam) ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 30తో గడువు ముగియనుందని ఎన్‌టీఏ తెలిపింది.
కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ కోచింగ్ కల్చర్‌కు దారితీసే అవకాశాన్ని తీసుకురాదని యూజీసీ చీఫ్ జగదీశ్ కుమార్ అన్నారు.
కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్టును 2023 నుంచి ఏడాది రెండు పర్యాయాలు నిర్వహించాలన్న అభ్యర్థుల ప్రతిపాదనను మరోసారి పరిశీలిస్తామని యూజీసీ చైర్మన్ తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నుంచి సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉందన్నారు.
ఆయా రాష్ట్రాల బోర్డుల నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు దీని వల్ల ఎలాంటి నష్టం ఉండదన్నారు. అన్ని రకాల బోర్డులకు సంబంధించిన విద్యార్థులకు ప్రయోజనం కలిగించే విధంగా సీయూఈటీ నిర్వహిస్తామన్నారు.
టాప్ ప్రైవేట్ యూనివర్సిటీలు సైతం సీయూఈటీ ఫలితాల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశాలు కల్పించనున్నాయని విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు యూజీసీ ఛైర్మన్.
సీయూఈటీ ఒక్కటి చాలు..
ప్రభుత్వ, ప్రైవేట్ మరియు డీమ్డ్ విశ్వవిద్యాలయాలు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశానికి CUET స్కోర్‌లను పరిగణణలోకి తీసుకుంటాయని గత వారం సైతం చెప్పారు. సీయూఈటీ ఎంట్రన్స్ ఉన్నందున UG ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి విద్యార్థులు ఇతరత్రా పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని ఏఎన్ఐతో అన్నారు. CUET ఉన్నందున విద్యార్థులు 12వ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాల్సిన అవసరం లేదని, ఒక్క పరీక్ష రాస్తే చాలు అని సూచించారు.
Also Read: Telangana Jobs 2022: నిరుపేద అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ శుభవార్త - లక్ష మందికి ఫ్రీ కోచింగ్