Telangana TET : తెలంగాణ టెట్ నోటిఫికేషన్(TET Notification) గురువారం విడుదల అయింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) సిలబస్ ను, ఇతర వివరాలను కన్వీనర్ రాధారెడ్డి(Radhareddy) తెలిపారు. 2017 టెట్ సిలబస్(TET Syllabus) ప్రకారమే పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీఈడీ(B.Ed), డీఎల్ఈడీ(D.L.Ed) చివరి సంవత్సరం విద్యార్థులు కూడా టెట్ రాసేందుకు అవకాశం కల్పించామని కన్వీనర్ పేర్కొన్నారు. పేపర్-1 లేదా పేపర్-2 లేదా రెండింటికీ కలిపి రూ.300 ఫీజు నిర్ణయించినట్లు తెలిపారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు(Online Applications) చేసుకోవచ్చని వెల్లడించారు. జూన్ 12న టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. జూన్ 27న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. టెట్‌కు సంబంధించి మార్చి 26 నుంచి హెల్ప్ డెస్క్ సేవలు ప్రారంభిస్తున్నట్లు రాధారెడ్డి తెలిపారు.
పూర్తి వివరాలకు
ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించేవారు టెట్ పేపర్ 1(TET Paper -1) రాయాల్సి ఉంటుంది. డీఎడ్, బీఎడ్ పాసైనవారు టెట్ పేపర్ -1 రాయడానికి అర్హులు. ఆరో నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించేవారు టెట్ పేపర్-2(TET Paper-2) రాయాలి. బీఎడ్ పాసైనవారు మాత్రమే టెట్ పేపర్-2 రాయడానికి అర్హులు. టెట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://tstet.cgg.gov.in/ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
టెట్ నోటిఫికేషన్ విడుదల
డీఎస్సీ కోసం అవసరమయ్యే టెట్ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చు. జూన్ 12 టెట్ నిర్వహిస్తారు. టెట్ కు అవసరమైన ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. 2015డిసెంబల్ 23న టెట్‌కు సంబంధించిన రెండు సవరణలు చేసింది ప్రభుత్వం. బీఈడీ పూర్తి చేసిన వాళ్లు కూడా ఎస్జీటీకి అర్హమైన పేపర్-1 కూడా రాసుకోవచ్చని తెలిపింది. ఉద్యోగం వచ్చిన తర్వాత బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేయాలని చెప్పింది. అది ఆరునెలలు ఉంటుంది. ఒకసారి టెట్‌లో అర్హత మార్కులు సాధిస్తే అది జీవితాంతం వర్తిస్తుందని కూడా సవరించింది. ఈ మధ్య జరిగిన శాసన సభ సమావేశాల్లో తెలంగాణ వ్యాప్తంగా 13 వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీలు గుర్తించామని వాటిని భర్తీ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అప్పటి నుంచి ఉద్యోగార్థుల్లో ఆశలు చిగురించాయి. కోచింగ్ సెంటర్‌లు కిటకిటలాడటం మొదలయ్యాయి. ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ రావడంతో ప్రిపరేషన్ మరింత ఊపందుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెట్ నిర్వహించడం ఇది మూడోసారి.
కొత్త విధానం అమల్లోకి
ఇప్పటి వరకు బీఈడీ చేసిన వాళ్లు ఆరు నుంచి పది తరగతుల వరకు బోధించేందుకు అర్హులగా ఉండే వాళ్లు 2008 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. అందుకే వాళ్లు రెండో పేపర్ మాత్రమే రాసేవాళ్లు. కానీ ఈ మధ్య కాలంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు కూడా బీఈడీ చేసిన వాళ్లు బోధించవచ్చని నిర్ణయించింది. అంటే ఎస్జీటీ పోస్టులకు కూడా వీళ్లు అర్హులని తేల్చింది ప్రభుత్వం. దీనికి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ అభ్యర్థులు ఆరునెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే ఇకపై మొదటి పేపర్ కూడా రాసేందుకు బీఈడీ చేసే వాళ్లు అర్హులు అవుతారు.