RRR Movie - NTR Specials: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్‌లో ఒక డైలాగ్ ఉంటుంది... 'బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగని నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తున్నాను' అని! ఎన్టీఆర్‌తో రామ్ చరణ్ చెప్పే డైలాగ్ అది! సినిమాలోనూ ఆ సన్నివేశం ఉంది. కొమురం భీమ్‌ను అల్లూరి సీతారామరాజు అరెస్ట్ చేస్తాడు. జైల్లో వేస్తాడు. అక్కడ ఖైదీలకు డ్రస్, నంబర్ ఇస్తారు కదా! ఖైదీగా ఎన్టీఆర్ నంబర్ ఎంతో తెలుసా?


'RRR' సినిమాలో ఖైదీగా ఎన్టీఆర్ నంబర్ 567. ఇంతకు ముందు కూడా ఎన్టీఆర్ ఖైదీగా కనిపించిన సన్నివేశాలు ఉన్నాయి. ఉదాహరణకు... 'టెంపర్' సినిమా! ఆ సినిమాలో ఎన్టీఆర్‌కు 627 నంబర్ ఇచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్. '7'తో రెండు ఖైదీ నంబర్లు ఎండ్ అవ్వడం మినహా మరొక పోలిక ఉండదు. యంగ్ టైగర్‌కు ఖైదీ నంబర్స్ విషయంలో సెంటిమెంట్ లేదనే అనుకోవాలి. 'రాఖీ' సినిమాలోనూ ఎన్టీఆర్ ఖైదీగా కనిపించారు. కానీ, ఖైదీ డ్రస్ వేసుకోలేదు. 'నాన్నకు ప్రేమతో' సినిమాలోనూ ఎన్టీఆర్ అరెస్ట్ అయ్యే సన్నివేశం ఉంటుంది. అయితే... ఖైదీ డ్రస్ ఏమీ ఉండదు. 'ఆర్ఆర్ఆర్'లో ఖైదీ డ్రస్ కాస్త కొత్తగా ఉంటుంది.


Also Read: 'ఆర్ఆర్ఆర్' సినిమా చూసిన ఎన్టీఆర్, రియాక్షన్ ఇదే!


'ఆర్ఆర్ఆర్' సినిమాకు వస్తే... ఎన్టీఆర్ నటనకు మంచి పేరు వస్తోంది. ఆయన ఇంట్రడక్షన్ సీన్ (పులితో ఫైట్), ఆ తర్వాత ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్స్ సినిమాకు హైలైట్ అయ్యాయి. 'కొమురం భీముడో...' పాటలో, సినిమాలో ఎన్టీఆర్ అభినయం అందర్నీ ఆకట్టుకుంటోంది. 'ఆర్ఆర్ఆర్' విడుదలకు ఒక్క రోజు ముందే ఎన్టీఆర్ ప్రీమియర్ వేసిన సంగతి తెలిసిందే. 


Also Read: మలయాళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్‌, తెలుగులో రీమేక్ చేస్తున్న కరణ్ జోహార్