కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లకు సంబంధించిన ఇష్యూ నడుస్తూనే ఉంది. ఫైనల్ గా టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసేసుకుంది. ప్రభుత్వం డిసైడ్ చేసే రేట్లకే టికెట్లను అమ్మాలని.. అది కూడా ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థలోనే టికెట్స్ బుక్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై ఇండస్ట్రీ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సురేష్ బాబు లాంటి వారు ఈ విషయంపై మాట్లాడగా.. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా ఈ విషయంపై స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.
''45 సంవత్సరాల ఇండస్ట్రీలో దర్శకుడిగా.. నిర్మాతగా నా అభిప్రాయలు అర్ధం చేసుకోండి.. మనం ఎప్పుడూ మూలాల్ని మర్చిపోకూడదు. నేను ఇవాళ ఈ పొజిషన్ లో ఉండడానికి కారణం ముందుగా ప్రేక్షకులు, థియేటర్ల యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్లు, నా నిర్మాతలు. వీళ్లందరూ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ప్రస్తుతం టికెట్లు, షోస్ నిర్ణయంతో చాలా మంది తీవ్ర నష్టాలకు గురవుతారు. కామన్ మ్యాన్ కి ఎంటర్టైన్మెంట్ సినిమా ఒక్కటే. ఒక గొప్ప అద్భుతమైన కథ కానీ.. హృదయానికి హత్తుకునే కథ కానీ, సరదా సరదాగా చూసే సినిమా కానీ థియేటర్లలో అంటే పెద్ద స్క్రీన్ లలో డీటీఎస్ అట్మాస్-3డి చూసిన అనుభూతి టీవీలో ఎట్టి పరిస్థితుల్లో ఉండదు.
షోస్ తగ్గించడం వలన గానీ, టికెట్ల ధర తగ్గించడం వలన గానీ పైన చెప్పిన అందరూ నష్టపోతారు. ఒక హిట్ సినిమా ఎక్కువ షోస్ వేసుకున్నా.. మొదటివారం రేట్స్ పెంచుకోవడం వలన, తరువాత కొన్ని మామూలు సినిమాలు వచ్చినా థియేటర్లు యాజమాన్యం.. వాళ్లని నమ్ముకున్న కొన్ని వేల మందికి 2-3 నెలలకు సరిపడా ఆదాయం.. ఎందుకంటే 100 సినిమాలో 10% హిట్స్ కన్నా ఉండవు. 10% ఏవరేజ్. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఆన్లైన్ వలన దోపిడీ ఆగిపోతుందని అనడం కరెక్ట్ కాదు.
ప్రేక్షకుడు ఒక మంచి సినిమా చూడాలనుకుంటే టికెట్ వెల 300 అయినా, 500 అయినా చూస్తాడు. ఒక రూపాయికే సినిమా చూపిస్తామన్నా అతనికి నచ్చని సినిమా చూడడు. పైగా ఆన్లైన్ లో చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్లు బ్లాక్ చేసుకొని, వాళ్ల శిష్యుల ద్వారా బ్లాక్ లో అమ్మవచ్చు. అదే రేట్లు పెంచి ఆన్లైన్ లో అమ్మితే థియేటర్ల వలన గవర్నమెంట్ కి ఎక్కువ ట్యాక్స్ వస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తగిన న్యాయం చేకూర్చాలని ఆశిస్తున్నాను'' అంటూ రాసుకొచ్చారు.
Also Read: థియేటర్లు దొరక్క... పదిహేను రోజులు వెనక్కి వెళ్లిన పూర్ణ సినిమా
Also Read: నా కంటే రెండు నెలలే పెద్దవాడు.. తనికెళ్ల భరణి కన్నీళ్లు.. ఓదార్చడం త్రివిక్రమ్ వల్ల కూడా కాలేదు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి