Radhika Merchant: ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో రాధిక మర్చంట్ స్పీచ్ - ఆ హాలీవుడ్ మూవీ నుంచి కాపీ కొట్టిందా?

ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో రాధికా మర్చంట్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. అద్భుతంగా మాట్లాడిందని పలువురు అభినందించారు. అయితే, ఆమె స్పీచ్ ఓ హాలీవుడ్ మూవీ నుంచి కాపీ కొట్టిందంటున్నారు నెటిజన్లు.

Continues below advertisement

Radhika Merchant's Speech Copied From Hollywood movie?: భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మార్చి 1 నుంచి 3 వరకు గుజరాత్ లోని జామ్ నగర్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా స్టార్ యాక్టర్లు అంతా హాజరయ్యారు. ఆటా పాటలో సందడి చేశారు.

Continues below advertisement

అనంత్ మాటలకు తల్లిదండ్రుల కంటతడి

ప్రీ వెడ్డింగ్ వేడుకలో కాబోయే వధూవరులు మాట్లాడిని మాటలు అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంత్ అంబానీ స్పీచ్ కు చాలా మంది తల్లిదండ్రులు ఏకంగా కంటతడి పెట్టారు. తాను ధనవంతుడిగా పుట్టినప్పటికీ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చారు. అనారోగ్యంతో ఎంతో పోరాడానని చెప్పారు. ఆ సమయంలో తన తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పేరెంట్స్ తో పాటు చిన్ననాటి ఫ్రెండ్ అయిన రాధికా మర్చంట్ కూడా తనను ఎంతో ప్రోత్సహించారని చెప్పారు. అనంత్ మాటలకు అతిథులు కాసేపు ఉద్వేగానికి లోనయ్యారు.

హాలీవుడ్ మూవీ నుంచి రాధికా స్పీచ్ కాపీ!

అనంత్ మాట్లాడిన తర్వాత అంబానీ ఫ్యామిలీకి కాబోయే కోడలు రాధికా మర్చంట్ కూడా మాట్లాడింది. చేతిలో ఎలాంటి నోట్ లేకుండా ఆమె అనర్గళంగా అనంత్ గురించి ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆహా అనిపించాయి. కానీ, ఆమె మాట్లాడిన మాటలు ఓ హాలీవుడ్ మూవీ నుంచి కాపీ కొట్టారంటూ ఓ నెటిజన్ వీడియో షేర్ చేశాడు. 2004లో వచ్చిన హాలీవుడ్ మూవీ నుంచి కాపీ కొట్టారని కామెంట్ చేశాడు. ‘షెల్ వియ్ డ్యాన్స్’ అనే సినిమాలో సుసాన్ సారండన్ మాట్లాడిన మాటలనే ప్రీ వెడ్డింగ్ వేడుకలో రాధిక చెప్పినట్లు వివరించాడు. ఇద్దరి మాటలు ఒకేలా ఉండటంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.  

రాధికా మర్చంట్ స్పీచ్ పై మిశ్రమ స్పందన

ఈ స్పీచ్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అవి రాధిక ఓన్ మాటలు కాదు, లోన్ మాటలు అంటూ అంబానీ ఫ్యామిలీ స్టైల్ లో సటైర్లు విసురుతున్నారు. ఎగ్జామ్ లో కాపీ కొట్టినట్టుగానే ఆమె హాలీవుడ్ మూవీ నుంచి తన స్పీచ్ ను కాపీ కొట్టిందని మరికొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. అది ఆమెకు నచ్చిన సినిమా కావొచ్చు. అందుకే ఆ డైలాగును ఆమె చెప్పింది. అందులో తప్పేముంది? ఆమె గురించి ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది? అని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. మొత్తంగా రాధికా మర్చంట్ ను కొందరు విమర్శిస్తుండగా, మరికొంత మంది సమర్ధిస్తున్నారు.     

Read Also: సల్మాన్ ఖాన్ పందిలా తింటాడు - విందు దారా సింగ్ షాకింగ్ కామెంట్స్

Continues below advertisement
Sponsored Links by Taboola