డిజిటల్ మయం... ఇప్పుడంతా డిజిటల్ మయం! పుట్టినరోజు, నిశ్చితార్థం, పెళ్లి, పార్టీ... అకేషన్ ఏదైనా సరే వీడియో షూట్ చేయాలంటే ఫోన్ లేదా కెమెరాలో తీసి మెమరీ కార్డుల్లో, హార్డ్ డిస్కుల్లో సేవ్ చేసుకుంటున్నారు. డిజిటల్ టెక్నాలజీ రాక ముందు పెళ్లి వీడియోలను వీసీఆర్ క్యాసెట్లలలో సేవ్ చేసేవారు. ఆ కాన్సెప్ట్ బేస్ మీద తెలుగులో తొలిసారి ఓ సినిమా రూపొందుతోంది. అదే 'సీతారాం సిత్రాలు'.


మారుతి విడుదల చేసిన కాన్సెప్ట్ ట్రైలర్
Seetaram Sitralu movie concept trailer released by Director Maruthi: 'సీతారాం సిత్రాలు' సినిమాలో లక్ష్మణ్ హీరోగా నటించారు. ఆయన సరసన భ్రమరాంబిక, కిశోరి ధాత్రిక్ హీరోయిన్లు. ఈ చిత్రాన్ని రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా పార్థ సారధి, డి. నాగేందర్ రెడ్డి, కృష్ణ చంద్ర విజయభట్టు ప్రొడ్యూస్ చేశారు. డి. నాగ శశిధర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రమిది. ప్రముఖ దర్శకులు, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'రాజా సాబ్' తెరకెక్కిస్తున్న మారుతి విడుదల చేశారు. 


''కొత్త కథ, కథనాలతో రూపొందే సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకాదరణ పొందుతాయి. 'సీతారాం చిత్రాలు' టైటిల్, ట్రైలర్ బాగున్నాయి. ఈ సినిమా విజయం సాధించి చిత్ర బృందం అందరికి మంచి పేరుతో పాటు నిర్మాతకు లాభాలు తీసుకు రావాలని కోరుకుంటున్నా'' మారుతి చెప్పారు. చిత్రీకరణ పూర్తి అయ్యిందని, త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు.


Also Readభీమా రివ్యూ: క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్ ఇచ్చిన గోపీచంద్ - సినిమా హిట్టా? ఫట్టా?



Seetharam Sitralu Trailer Review: 'సీతారాం సిత్రాలు' ట్రైలర్ విషయానికి వస్తే... వీసీఆర్ క్యాసెట్ ఇస్తే, అందులో వీడియోకి విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి సీడీల్లో సేవ్ చేసి ఇవ్వడం హీరో పని. సొంతంగా ఓ షాప్ పెడతాడు. అఫ్‌కోర్స్... ఆ పనిలో కూడా కాంపిటీషన్ ఉందనుకోండి. 'వాడు అయితే పెళ్లి క్యాసెట్టులకు బాహుబలి, ఆర్ఆర్ఆర్ వీఎఫ్ఎక్స్ వేస్తున్నాడు. అదే నేను వాడి దగ్గరకు వెళ్ళాలననుకో... ఆదిపురుష్ వీఎఫ్ఎక్స్‌లు కూడా నేర్చుకోవచ్చురా' అని హీరో చెప్పే డైలాగ్ వైరల్ అయ్యేలా ఉంది. 


'సీతారాం సిత్రాలు'లో కామెడీతో పాటు ప్రేమకథ కూడా ఉంది. హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు సైతం చూపించారు. ఇందులో హీరోయిన్ భ్రమరాంబిక టీచర్ రోల్ చేశారు. 'ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే వరకు ఇది మన ప్రాపర్టీ అని చెప్పుకోలేం. ఇప్పుడు ఇంకా ఘోరం... పెళ్లి చేసుకునే అమ్మాయిని కూడా కాన్ఫిడెంట్ గా ఇది మన ప్రాపర్టీ అని చెప్పుకోలేకపోతున్నాం' అని హీరో చెబుతున్నాడు. అలా ఎందుకు చెప్పారో సినిమాలో చూడాలి. 


'సీతారాం సిత్రాలు' ట్రైలర్ స్టార్టింగ్ కామెడీ, లవ్ సీన్లతో ఉంటే... ఎండింగ్ వచ్చే సరికి ట్విస్ట్ ఇచ్చారు. మర్డర్ విజువల్స్ ఉన్న వీసీఆర్ క్యాసెట్ ఇచ్చి గ్రాఫిక్స్ యాడ్ చేయమని ఒకరు అడుగుతారు. ఆ మర్డర్ చేసింది ఎవరు? ఆ క్యాసెట్ హీరో దగ్గరకు వచ్చిన తర్వాత ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


Also Readగామి రివ్యూ: అఘోరాగా విశ్వక్‌ సేన్ నటించిన సినిమా ఎలా ఉంది? హిట్టా


లక్ష్మణ్ హీరోగా భ్రమరాంబిక, కిశోరి ధాత్రిక్ హీరోయిన్లుగా నటించిన 'ఢిల్లీ' రాజేశ్వరి, కృష్ణమూర్తి, సందీప్ వారణాశి, గురుస్వామి ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్, నిర్మాతలు: పార్థ సారధి - డి. నాగేందర్ రెడ్డి - కృష్ణ చంద్ర విజయభట్టు, ఛాయాగ్రహణం: అరుణ్ కుమార్ పర్వతనేని, స్వరాలు: రుద్ర కిరణ్, నేపథ్య సంగీతం: శిరీష్ సత్యవోలు, కూర్పు: ప్రణీత్ కుమార్, సౌండ్ డిజైన్: సాయి మనిందర్ రెడ్డి, సాహిత్యం: శేఖర్ రాజు విజయభట్టు, రచన - దర్శకత్వం: డి. నాగ శశిధర్ రెడ్డి.