Four People Died in Araku Valley Accident: అల్లూరి (Alluri) సీతారామరాజు జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అరకులోయ (Araku Valley) మండలం మాదల పంచాయతీ పరిధిలో దుమ్మగుడ్రి - గంజాయిగుడ గ్రామాల మధ్య 3 ద్విచక్ర వాహనాలు ఢీకొని అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బైక్స్ ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్ కు తరలించారు. అరకులోయ - లోతేరు రహదారిలోని నందివలస గ్రామంలో శుక్రవారం రాత్రి జాతర చూసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు చర్లపూడి గ్రామానికి చెందిన బురిడి హరి (22), అమలాకాంత్ (9), లోతేరు పంచాయతీ మంజగుడకి చెందిన త్రినాథ్ (32), భార్గవ్ (4)లుగా గుర్తించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Siddham Meeting : నాలుగో సిద్ధం సభకు వైసీపీ భారీ ఏర్పాట్లు- 200 ఎకరాల్లో నిర్వాహణ