Vindu Dara Singh About Salman Khan: విందు దారా సింగ్.. సల్మాన్ ఖాన్ సన్నిహితుడు. కాలేజీ రోజుల నుంచే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అప్పట్లోనే విందు దారా సింగ్ కు ఫిట్ బాడీ ఉండేది. సల్మాన్ కూడా ఆయన కంటే మంచి బాడీ కోసం ప్రయత్నించే వారు. బాగా పుడ్ తినడంతో పాటు గంటల తరబడి జిమ్ లో వర్కౌట్స్ చేసే వారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విందు.. సల్మాన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. పుడ్, జిమ్ విషయంలో సల్మాన్ ఎట్టిపరిస్థితుల్లో రాజీ పడేవాడు కాదని చెప్పుకొచ్చారు.


తినడం, జిమ్ చేయడమే పని!


“కాలేజీ రోజుల్లో సల్మాన్ నేను కలిసి చదువుకునే వాళ్లం. చదువుతో పాటు బాడీ ఫిట్ నెస్ మీద నేను చాలా ఫోకస్ పెట్టేవాడిని. మంచి శరీరాకృతి కోసం బాగా కష్టపడేది. కొద్ది రోజుల తర్వాత నేను అనుకున్నట్లుగా ఫిట్ నెస్ సాధించాను. నన్ను చూసి సల్మాన్ కూడా తన బాడీని పెంచుకునేందుకు ప్రయత్నించాడు. నా కంటే ఎక్కువగా జిమ్ లో గడిపేవాడు. పందిలాగా తినడం, కుక్కలాగా జిమ్ జిమ్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. సల్మాన్ తీరు చూసి బాగా అతి చేస్తున్నాడు అనిపించేది. అతడు ఫుడ్ తినే విధానాన్ని చూసి, భాయ్, ఆ తిండి అంతా ఎక్కడికి పోతుంది? అని అడిగేవాణ్ణి. సాయంత్రం జిమ్ లో కాలిపోతుంది అని చెప్పేవాడు” అని విందు దారా సింగ్ చెప్పుకొచ్చారు.


నెలకు రూ. 30 లక్షల సాయం


సల్మాన్ లాంటి  మంచి మనుషులు చాలా అరుదుగా ఉంటారని విందు దారా సింగ్ అభిప్రాయపడ్డారు. ఆయనంటే  ఎంతో ఇష్టమని చెప్పారు. ఎదుటి వారు కష్టాల్లో ఉంటే ఎదురెళ్లి మరీ సాయం చేస్తారని చెప్పారు. అతడి తండ్రి ఇచ్చే పాకెన్ మనీని కూడా  తన దగ్గర పని చేసే వాళ్లకు ఇచ్చే వారని వెల్లడించారు. “సల్మాన్ తండ్రి (వెటరన్ స్క్రీన్ రైటర్ సలీం ఖాన్) అతడికి ప్రతిరోజూ పాకెట్ మనీ ఇచ్చేవారు. ఆ డబ్బును సల్మాన్ తన అసిస్టెంట్ నదీమ్‌ కు ఇచ్చేవారు. సల్మాన్‌ ఖర్చుల కోసం తండ్రి ఇచ్చే డబ్బులో చాలా వరకు పేదలకు దానం చేసే వారు. ఇప్పటికీ ఆయన నెలకు రూ. 25 నుంచి 30 లక్షలు దానంగా ఇస్తారు. అందుకే సల్మాన్ అంటే నాకు చాలా ఇష్టం” అని చెప్పారు.   


సాయం కోరి వచ్చే వారికి నో చెప్పరు!


సల్మాన్ పేదల విషయంలో చాలా దయా గుణాన్ని కలిగి ఉంటారని విందు దారా సింగ్ వెల్లడించారు. ఇప్పటికీ చాలా మంది ఆయన సాయంతో కోసం తన నివాసానికి వస్తారని, వారికి తప్పకుండా సాయం చేసి పంపిస్తారని చెప్పారు. సల్మాన్ ఖాన్ లాంటి వ్యక్తి నా మిత్రుడు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని విందు దారా సింగ్ అభిప్రాయపడ్డారు.   


Read Also: ‘పుష్ప 2’ తర్వాత మరో క్రేజీ ఆఫర్‌‌ను వదులుకున్న శ్రీలీల, కారణం ఇదేనా?