'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' సినిమాతో ఇటీవల విజయం అందుకున్నారు సుహాస్ (Suhas Upcoming Movie). యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు వైవిధ్యమైన పాత్రలతో తన ప్రత్యేకత చాటుకుంటున్న ఆయన నటించిన తాజా సినిమా 'శ్రీరంగనీతులు'. ఇందులో 'బేబీ'తో భారీ విజయం అందుకున్న యువ హీరో విరాజ్ అశ్విన్, 'చిలసౌ' & 'హిట్' సినిమాల ఫేమ్ రుహానీ శర్మ జంటగా నటించారు. 'కేరాఫ్ కంచరపాలెం', 'నారప్ప' సినిమాల ఫేమ్ కార్తీక్ రత్నం ఓ ప్రధాన పాత్ర చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
ఏప్రిల్ 12న 'శ్రీరంగనీతులు' విడుదల
Sri Ranga Neethulu 2024 movie release date: 'శ్రీరంగనీతులు' చిత్రాన్ని రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి ప్రొడ్యూస్ చేశారు. ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 12న థియేటర్లలో తమ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ఆల్రెడీ విడుదలైన టీజర్, 'వినరా వినరా చెబుతా వినరా ఈ కాలం...' పాటకు మంచి స్పందల లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. 'యానిమల్' ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు.
Also Read: భీమా రివ్యూ: క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్ ఇచ్చిన గోపీచంద్ - సినిమా హిట్టా? ఫట్టా?
ప్రేమికుడికి హ్యాండ్ ఇస్తున్న అమ్మాయిలు
ముగ్గురు యువకుల కథగా 'శ్రీరంగనీతులు' సినిమా తెరకెక్కించినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. విరాజ్ అశ్విన్ కథకు వస్తే... రుహానీ శర్మతో ప్రేమలో ఉంటాడు. ఆమె డబ్బున్న అమ్మాయి. 'నేను అడిగితే తన పేరు చెప్పలేదు. వాళ్ళ నాన్న అడిగితే నీ పేరు చెబుతుందా?' అని హీరోని వాసు ఇంటూరి ప్రశ్నిస్తాడు. 'నువ్వు అనుకున్నంత ఈజీ ఏం కాదు. నేను నా ఫ్యామిలీతో డీల్ చేయాలి. మా నాన్నను తలుచుకుంటే నాకు భయం వేస్తుంది' అని హీరోతో హీరోయిన్ చెబుతుంది. వీళ్ళ ప్రేమ కథ ఏ తీరాలకు చేరిందనేది సినిమాలో చూడాలి. 'ఈ మధ్యే ఒక రీసెర్చ్ లో తెలిసింది. 85 పర్సెంట్ మంది అమ్మాయిలు వాళ్ళు లవ్ చేసిన విషయం ఇంట్లో కూడా చెప్పకుండా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారట' అని విరాజ్ అశ్విన్ చెప్పిన డైలాగ్ వైరల్ అయ్యింది.
Also Read: గామి రివ్యూ: అఘోరాగా విశ్వక్ సేన్ నటించిన సినిమా ఎలా ఉంది? హిట్టా
బాగుపడాలా? నీకు నచ్చినట్టు ఉండాలా?
కార్తీక్ రత్నం విషయానికి వస్తే... మందు, సిగరెట్,గంజాయి అంటూ తనకు నచ్చిన విధంగా జీవిస్తున్నారు. అతని తండ్రిగా దేవి ప్రసాద్ నటించారు. 'నీ ప్రాబ్లమ్ ఏంటి?' అని తండ్రి అడిగితే 'నువ్వు బాగుపడాలని'' అని సమాధానం వస్తుంది. 'బాగుపడాలా? నీకు నచ్చినట్టు ఉండాలా?'' అని హీరో ప్రశ్నిస్తాడు. సుహాస్ విషయానికి వస్తే.. ఊరంతా తన ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టించడం అతని అలవాటు. 'ఎందుకురా మీకు ఇవన్నీ?' అని పెద్దలు చెబితే... 'మన గురించి ఎలా తెలుస్తుంది అందరికీ' అని స్నేహితులతో చెప్పే టైపు. మూడు కథలు ఒక్కటి అయ్యాయా? లేదా? అనేది సినిమాలో చూడాలి.