Sreeleela Rejects Another Crazy Offer: టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా కొనసాగుతోంది శ్రీలీల. గత ఏడాది సుమారు అర డజన్ సినిమాల్లో నటించింది. వాటిల్ ‘స్కంద’, ‘భవంత్ కేసరి, ‘ఆదికేశవ’, ‘ఎక్ట్రాఆర్డినరీ’ సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. వీటిలో ‘భగవంత్ కేసరి’ మాత్రం మంచి సక్సెస్ అందుకుంది. ‘స్కంద’ సినిమా ఫర్వాలేదు అనిపించినా, మిగతా సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ‘గుంటూరు కారం’ సినిమాతో 2024ను ప్రారంభించిన ఈ క్యూట్ బ్యూటీకి నిరాశే ఎదురయ్యింది. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. వరుస పరాభవాలు ఎదురవుతున్న నేపథ్యంలో సినిమాలకు కాస్త బ్రేక్ ఇవ్వాలని భావిస్తుందట. సినిమాలు చేయకూడదని శ్రీలీల అనుకుంటున్నా, వరుస అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయట. తాజాగా ఓ క్రేజీ ఆఫర్ వచ్చినా నో చెప్పినట్లు తెలుస్తోంది.


‘పుష్ప 2’ తర్వాత మరో మూవీకి నో


కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ మూవీలో శ్రీలీలకు ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది. ఓ స్పెషల్ సాంగ్ చేయాలని చిత్రబృందం ఆమెను సంప్రదించింది. ఇందుకోసం పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ చేసిందట. అయినప్పటికీ తాను ఆ సాంగ్ చేయలేనని చెప్పిందట శ్రీలీల. తాజాగా మరో స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ వచ్చిందట. ఈ పాటను కూడా చేయలేనని చెప్పిందట. హీరోయిన్ గా మంచి స్వింగ్ లో ఉన్న తాను ఐటెం సాంగ్స్ చేస్తే తర్వాత వచ్చే అవకాశాల మీద ఎఫెక్ట్ పడుతుందని ఆమె భావిస్తుందట. ఇదే విషయాన్ని సదరు చిత్రబృందానికి చెప్పి, అవకాశాన్నివదులుకుందట. డబ్బు కోసం స్పెషల్ సాంగ్స్ చేస్తే, తన కెరీర్ కు ఇబ్బంది కలిగి అవకాశం ఉందని శ్రీలీల అనుకుంటుందట.   


ఓ వైపు సినిమాలు, మరోవైపు చదువు


ఇక శ్రీలీల (Sreeleela) సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నా, చదువు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయడం లేదు. సినిమాలు, చదువు బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం ఆమె MBBS చదువుతోంది. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రిపరేషన్ లో బిజీ అయ్యింది. అందుకే, సినిమాలకు కొద్ది రోజుల పాటు బ్రేక్ ఇవ్వబోతుంది. ఆమె గతంలో ఒప్పుకున్నన పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా మాత్రమే కంప్లీట్ చేయనుంది. ఆ తర్వాత చదువు మీద ఫోకస్ పెట్టనుంది.   


చివరిగా ‘గుంటూరు కారం’లో కనిపించిన శ్రీలీల


శ్రీలీల చివరిసారిగా ‘గుంటూరు కారం’ సినిమాలో కనిపించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత ఈ క్రేజీ కాంబోలో తెరక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా, అంచనాలను అందుకోలేకపోయింది. ఈ చిత్రం ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాగా మిగిలిపోయింది.  


Read Also: ఆ సీన్స్ చెయ్యడానికి రెడీ - ఫస్ట్ లిప్‌లాక్ అతడికే అంటున్న బజ్జీ పాప!