Kushitha Kallapu On Lip Kiss Scenes: సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయిన బ్యూటీ కుషిత కల్లపు. ఆ మధ్య బజ్జీలు తినడానికి పబ్బుకు వెళ్లానని చెప్పిన వీడియో ఒకటి నెట్టింట ఓ రేంజిలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ గా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మఇప్పటికే పలు షార్ట్ ఫిలిమ్స్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. ఓవైపు నెట్టింట అందంచందాలతో ఆకట్టుకుంటూనే, సినిమాలపైనా  ఫోకస్ పెట్టింది.  


ప్రేక్షకుల ముందుకు ‘బాబు- నెంబర్ 1 బుల్ షిట్ గాయ్’


తాజాగా ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కల్యాణ్ తో కలిసి ‘బాబు- నెంబర్ 1 బుల్ షిట్ గాయ్’ అనే సినిమాలో నటించింది.  లక్ష్మణ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇవాళ(మార్చి 8న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా విడుదల అయ్యింది. విలాసం కన్నా అవసరం గొప్పది అనే కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కించినట్లు మేకర్స్ గతంలోనే వెల్లడించారు.  ఈ చిత్రాన్ని డీడీ క్రియేషన్స్ పతాకంపై దండు దిలీప్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఇందులో ఎంఎల్ఆర్, సోనాలి, 'బలగం', 'డీజే టిల్లు' ఫేమ్ మురళీధర్ గౌడ్, భద్రం, 'జబర్దస్త్' అప్పారావు, రవి వర్మ, సునీత మనోహర్, అశోక్ వర్ధన్, భద్రి జార్జి సహా పలువురు కీలక పాత్రలు పోషించారు.  


నా ఫస్ట్ లిప్ కిస్ అతడికే- కుషిత  


ఇప్పటికే ‘బాబు- నెంబర్ 1 బుల్ షిట్ గాయ్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అర్జున్, కుషిత వరుసబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా కుషిత ఇంటిమేట్ సన్నివేశాలు, లిప్ కిస్ సీన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంటిమేట్ సీన్లు చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. లిప్ కిస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టనని వెల్లడించింది. “లిప్ కిస్ మాత్రం పెట్టను. ఇంటిమేట్ సీన్స్ చేయడానికి ఇబ్బంది ఏమీ లేదు. నా ఫస్ట్ లిప్ కిస్ నా భర్తకే” అని చెప్పుకొచ్చింది.


‘బాబు- నెంబర్ 1 బుల్ షిట్ గాయ్’ ఇద్దరికీ ఎంతో ముఖ్యం


ఇక క్యూట్ బ్యూటీ కుషిత కల్లపు గత ఏడాది 'నీతోనే నేను' అనే సినిమాలో కనిపించింది.  అర్జున్ కల్యాణ్ 'అడ్డతీగల' అనే సినిమాలో నటించారు. అంతకు ముందు 'పెళ్లికూతురు పార్టీ' చిత్రంలో నటించారు. ఈ సినిమాలేవీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి. అందుకే, ‘బాబు నెంబర్ 1 బుల్ షిట్ గాయ్’ విజయం ఇద్దరికీ చాలా అవసరం. ఈ సినిమా హిట్ అయితే ఇండస్ట్రీలో నిలదొక్కుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.  ప్రేక్షకులు ఈ సినిమాకు ఎలాంటి విజయాన్ని అందిస్తారో చూడాలి.






Read Also : కమల్ ‘గుణ’ పాటకు భలే క్రేజ్ - ‘తమిళనాట ‘మంజుమ్మెల్ బాయ్స్’ సంచలనం, ఇంతకీ ఆ సాంగ్‌కు.. సినిమాకు లింకేమిటీ ?