Mohammed Shami: టీమిండియా(Team India)కు చెందిన మరో స్టార్‌ క్రికెటర్‌ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు  తెలుస్తోంది. భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టిన స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ(Mohammed Shami) రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. షమీ బీజేపీ(BJP)లో చేరనున్నట్లు తెలుస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో షమీ  పశ్చిమ బెంగాల్‌(West Bangal) నుంచి పోటీ చేయనున్నట్లు పేర్కొన్నాయి. 



ఇటీవలే షమీ గురించి మోదీ ట్వీట్‌
చీలమండ గాయం కారణంగా క్రికెట్(Cricker) కు దూరంగా ఉన్న భారత పేసర్ మహమ్మద్ షమీ(Mohammad Shami) తనకు లండన్‌లో జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందంటూ సోషల్ మీడియా వేదికగా ఫొటోలను పంచుకున్నాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని, కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని షమీ చెప్పాడు. అయితే ఈ విషయంపై ప్రధాని(PM) స్పందించారు. శస్త్రచికిత్స చేయించుకున్న ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని మోదీ(Modi) ఆకాంక్షించారు. షమీ వీలైనంత త్వరగా గాయం నుంచి కోలుకొని దేశం తరపున ఆడాల‌ని కోరుకుంటున్నానని ఆయ‌న ట్వీట్ చేశారు.


గత నవంబరులో ప్రపంచకప్‌ ఫైనల్‌లో చివరి మ్యాచ్ ఆడాడు షమ్మీ. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‍తో పాటు దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు అఫ్గానిస్థాన్‍తో టీ20 సిరీస్‍కు కూడా అందుబాటులోకి రాలేదు. గాయం కారణంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌కు అతనికి విశ్రాంతి ఇచ్చారు. జనవరి చివరి వారంలో లండన్‌లో కొన్ని చీలమండ ఇంజెక్షన్లు తీసుకున్న షమి తేలికపాటి పరుగులు సాధన చేశాడు. అయితే 3 వారాల తర్వాత ఇంజెక్షన్ల ప్రభావం పూర్తిగా తగ్గిపోవడంతో  నొప్పి మళ్లీ తిరగబెట్టింది. ఇక శస్త్రచికిత్స మినహా మరే మార్గంలేదని బీసీసీఐ వర్గాలు చెప్పాయి. నొప్పితోనే ప్రపంచకప్ ఆడిన షమి ఆ ప్రభావం మ్యాచ్‌లపై పడనివ్వలేదని సమాచారం..


కష్టాల ప్రయాణం చేసి
ఒకప్పుడు భార్య పెట్టిన గృహ హింస కేసు, వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు, కోర్టు సమన్లు ఆత్మహత్య చేసుకొందామన్న ఆలోచనలు రోడ్డు ప్రమాదం ఇలా ఒకటా రెండా షమీని సమస్యలు చుట్టుముట్టాయి. అయినా షమీ వెనక్కి తగ్గలేదు. ఇంకా దృఢంగా తయారయ్యాడు. చాలాకాలం వరకు జట్టులో చోటు దొరకకపోయినా కుంగిపో లేదు. తానేంటో నిరూపించుకోవాలన్న కసితో తీవ్రంగా సాధన చేశాడు. దానికి తగ్గ ఫలాలను అందిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తన కుటుంబం గురించి మీడియా తో పంచుకున్నాడు. తన కుమార్తె ఐరాను కలుసుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశాడు. కుటుంబ విభేదాల వల్ల కొన్నాళ్లుగా షమీ తన భార్య హసిన్‌ జహాన్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కుమార్తెను చూడటానికి, మాట్లాడటానికి తనను అనుమతించడం లేదని, కొన్ని సందర్భాల్లో మాత్రమే మాట్లాడుతున్నానని తెలిపాడు. ఎవరూ తన కుటుంబాన్ని, పిల్లలను కోల్పోవాలనుకోరు. కానీ కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఆరోగ్యంగా ఉంటూ అన్నింటిలో విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నాడు.