Raayan Day 1 Worldwide Box Office Collection: కోలీవుడ్ స్టార్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ‘రాయన్‘. ధనుష్ సినీ కెరీర్ లో 50వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రం తన సినీ కెరీర్ లో స్పెషల్ గా ఉండాలనే ఉద్దేశంతో స్వయంగా ధనుష్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. జులై 26న భారీ అంచనాల నడుమ ఈ సినిమా  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో థియేటర్లలో విడుదల అయ్యింది. రివేంజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ గా  తెరకెక్కిన ఈ మూవీ కొన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకోగా, మరికొన్ని ప్రాంతాల్లో మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా తొలిరోజు సాధించిన కలెక్షన్స్ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..


‘రాయన్‘ తొలి రోజు కలెక్షన్స్ ఎంత అంటే?


‘రాయన్‘ సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ సాధించింది. తొలి రోజు ఈ సినిమా దేశ వ్యాప్తంగా 12.5 కోట్ల నెట్ క‌లెక్ష‌న్స్ అందుకుంది. తెలుగు వెర్షన్ నుంచి రూ. 1.6 కోట్లు రాగా,  తమిళ వెర్షన్‌ రూ. 11.85 కోట్లు సంపాదించింది. హిందీ బెల్ట్ లో ఈ సినిమా అనుకున్న స్థాయిలో వసూళ్లను సాధించలేకపోయింది. అక్కడ ఈ సినిమాకు కేవలం రూ. 20 లక్షలు మాత్రమే వచ్చాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా ఈ సినిమా తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ. 16 కోట్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఓపెనింగ్ డే గ్రాస్ సుమారు రూ. 22 కోట్లు సాధించింది. ధనుష్ కెరీర్ లో ఇప్పటి వరకు ఆయన నటించి ‘కర్ణన్‘ సినిమా అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించగా, ఇప్పుడు ఆ రికార్డును ‘రాయన్‘ బద్దలుకొట్టింది. తమిళ నాట ‘ఇండియన్ 2‘ తర్వాత అత్యధిక ఓపెనింగ్ డే గ్రాసర్ గా నిలిచిన చిత్రంగా నిలిచింది.ఇక ఈ సినిమా తొలి రోజు తమిళంలో ‘రాయన్‘ మూవీకి 58.65 ఆక్యుపెన్సీ నమోదయ్యింది. శని, ఆదివారాల్లో ఈ మూవీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.   


కీలక పాత్రలో నటించిన టాలీవుడ్ హీరో సందీప్ కిషన్


అటు ‘రాయన్‘ సినిమాలో ధనుష్ ప్రధాన పాత్రలో కనిపించగా, టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలపోషించారు. ఎస్‌జే సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, కాళిదాస్ జయరామ్, దుసరా విజయన్, అపర్ణ బాలమురళి, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్ ఇతర పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ పతాకంపై తమిళ అగ్ర నిర్మాత కళానిధి మారన్ నిర్మించారు.


Also Read : విజ‌య దేవ‌ర‌కొండ ఏం త‌ప్పు చేశాడ‌ని ట్రోల్ చేశారు ? నివేద థామ‌స్ లావైతే వాళ్ల‌కెందుకు - రాజీవ్ క‌న‌కాల‌



Read Also : రాయన్ రివ్యూ : బాషా టైపు కథతో ధనుష్ 50వ సినిమా - హీరోగా, దర్శకుడిగా ఆయన హిట్టా ? ఫట్టా ?