Raashi Khanna | రాశీ ఖన్నా.. టాలీవుడ్ ఫేవరెట్ హీరోయిన్స్‌లో ఒకరు. తెలుగు, తమిళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాశీ ఖన్నా.. ఇటీవలే ఓ వెబ్ సీరిస్‌లో ఛాన్స్ కొట్టేసింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌తో కలిసి ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్’ వెబ్ సీరిస్‌లో నటించింది. నెగటీవ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రలో రాశీ ఖన్నా ఒదిగిపోయింది. ఈ నేపథ్యంలో రాశీ ఖన్నా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను ఎందుకు సన్నబడాల్సి వచ్చిందో తెలిపింది.
ఇంత స్పందన వస్తుందని అనుకోలేదు: ‘‘రుద్ర - వెబ్ సీరిస్‌కు ఇంత స్పందన వస్తుందని అస్సలు ఊహించలేదు. ఇందులో అలియా చోక్సీ పాత్ర నాకు మంచి పేరు తెచ్చింది. ఈ పాత్రల్లో ఎన్నో హవభావాలు పలికించాలి. ఈ పాత్రను చేయడానికి సిద్ధమైనప్పుడు కొంచెం రిస్క్ చేస్తున్నా అనిపించింది. ప్రస్తుతం ప్రేక్షకులను ఓటీటీలను ఎక్కువ ఇష్టపడుతున్నారు. అయితే, నాకు వైవిధ్యమైన పాత్ర లభించడం వల్లే ఈ సీరిస్‌కు అంగీకరించాను. హీరోయిన్ అంటే కేవలం డ్యూయెట్స్, రొమాంటిక్ సీన్స్ కోసమే అన్నట్లు కాకుండా భిన్నంగా ఉండాలని కోరుకుంటాను. స్క్రిప్ట్ బాగుంటే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమే’’ అని తెలిపింది.
కాపీ రైటర్ కావాలనుకున్నా: ‘‘నేను సినిమాల్లోకి రాక ముందు కాపీ రైటర్ కావాలని అనుకున్నా. డిగ్రీ తర్వాత ఆ కోర్సు చేయాలనుకున్నా. అదే సమయంలో బాలీవుడ్‌లో ‘మద్రాస్ కేఫ్’ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్.. ‘ఊహలు గుసగుసలాడే’ స్క్రిప్ట్‌తో నన్ను సంప్రదించారు. అది బాగా నచ్చడంతో అవకాశాన్ని కాదనలేకపోయా. ఆ తర్వాత అవకాశాలు క్యూ కట్టాయి. దక్షిణాదిలో మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ, బాలీవుడ్‌లో ఆచితూచి చిత్రాలను సెలక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నా. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘యోధ’ షూటింగ్ జరుగుతోంది. తర్వాతి చిత్రం షాహిద్ కపూర్‌తో ఉంటుంది’’
గ్యాస్ ట్యాంకర్ అనేవారు: ‘‘కెరీర్ ప్రారంభంలోనే నాకు మంచి పాత్రలు లభించడం ఎంతో లక్కీ. కానీ, నేను ఎక్కువ లావుగా ఉండటం వల్ల కొన్ని విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. దక్షిణాదిలో చాలామంది నన్ను ‘గ్యాస్ ట్యాంకర్’ అని పిలిచేవారు. కానీ, నేను అందుకు ఫీలవ్వలేదు. బరువు తగ్గాల్సిన అవసరం ఉందని భావించాను. అందుకే కష్టపడి సన్నబడ్డాను. అది నా కేరీర్‌కు ఎంతగానో ఉపయోగపడింది’’ అని తెలిపింది.
Also Read: రాజమౌళిని డిజప్పాయింట్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్
PCOD సమస్య వల్లే బరువు పెరుగుతున్నా: ‘‘నాకు PCOD (polycystic ovarian disease) ఉంది. అందువల్లే నేను నా బరువును కంట్రోల్ చేయలేను. కేరీర్ ఆరంభంలో నా బరువును అంతగా ఎందుకు పట్టించుకుంటారని భావించాను. నాకు PCOD సమస్య ఉందని నాకు మాత్రమే తెలుసు. అయినా వారు నేను స్క్రీన్ మీద ఎలా కనిపిస్తానని మాత్రమే చూస్తారు. కాబట్టి వారిని నేను నిందించలేను. మొదట్లో కొన్ని సమస్యలు ఎదుర్కున్నా. నేను ఆధ్యాత్మికంగా స్ట్రాంగ్. కాబట్టి వాటిని మైండ్‌లోకి తీసుకోలేదు’’ అని రాశీ పేర్కొంది.