EAP TEST: ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్ అండ్‌ అగ్రికల్చర్‌ ఎంట్రన్స్ టెస్టు జులైలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటికే అన్ని రకాల పరీక్షలు పూర్తవుతాయని అ తేదీల్లోనే విద్యార్థులకు ఈ పరీక్ష రాసే వీలు ఉంటుందని ప్రకటించింది. EAP టెస్టుకు సంబంధించిన తేదీలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. 


EAP ఎంట్రన్స్ పరీక్ష జులై నాలుగు నుంచి ప్రారంభం కానుంది. రెండు విభాగాల్లో జరిగే ఈ పరీక్ష జులై 12 వరకు నిర్వహిస్తారు. ముందుగా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలు పూర్తవుతాయి. అవి జులై 4 నుంచి జులై 8 ఐదు రోజుల పాటు జరుగుతాయి. ఆ తర్వాత అగ్రికల్చర్‌  పరీక్ష నిర్వహిస్తారు. అది జులై 11, 12 తేదీల్లో రెండు రోజులపాటు జరగనుంది. 


ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విద్యార్థులకు అందుబాటులో ఉండేలా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. అప్పటికి ఉన్న పరిస్థితుల బట్టి కరోనా నిబంధనల మేరకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తెలంగాణలో కూడా నాలుగు పరీక్ష కేంద్రాలను పెడుతున్నట్టు మంత్రి తెలిపారు.  






EAP సెట్‌కు సంబంధించి నోటిపికేషన్ ఏప్రిల్‌ 11న విడుదల చేస్తామన్నారు ఆదిమూలపు సురేష్. అందులో మరింత స్పష్టంగా వివరాలు వెల్లడిస్తామన్నారు.  జాతీయ స్థాయి, ఇతర కాంపిటేటివ్ పరీక్షలతో ఎక్కడా ఇబ్బంది రాకుండా  EAP సెట్‌ టైంటేబుల్  రూపొందించినట్టు పేర్కొన్నారాయన. ఫలితాలను కూడా ఆగస్టు 15నాటికి ఇచ్చే ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అప్పటికే ఇంటర్‌ ఫలితాలు కూడా విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు. మే ఆరు నుంచి 24 వరకు ఇంటర్‌ ఎగ్జామ్స్‌ పూర్తవుతాయన్నా సురేష్‌, పదోతరగతి పరీక్షలను ముందుగానే పూర్తి చేస్తున్నట్టు వెల్లడించారు. వాటిని ఏప్రిల్‌ 27 నుంచి మే 9 వరకు కంప్లీట్ అవుతాయన్నారు.