కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణంతో కన్నడ సినిమా ఇండస్ట్రీతో పాటు భారత సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన హఠాన్మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
కన్నడ ఇండస్ట్రీలో పునీత్ ఫాలోయింగ్ చూస్తే గనుక మతిపోతుంది. తండ్రి లెగసీను కాపాడడమే కాకుండా.. తనకంటూ ఓ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. వెండితెరపై హీరోగా మిగిలిపోకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు పునీత్. తన సినీ కెరీర్ మొదలైనప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టాడు పునీత్. ఇందులో భాగంగా ఉచిత విద్యను అందించడంతో పాటు దిక్కులేని వారికి తనే దిక్కుగా మారాడు.
Also Read: పునీత్ మరణం నమ్మశక్యంగా లేదు.. పవన్ భావోద్వేగం..
పునీత్ తన 46 ఏళ్ల జీవితంలో 45 ఫ్రీ స్కూల్స్, 26 అనాధ శరణాలయాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలను నిర్మించడంతో పాటు.. 1800 మంది స్టూడెంట్స్ కి ఉచిత విద్యను అందించారు. పునీత్ చేసిన ఈ సేవలకు గాను కన్నడ ఇండస్ట్రీ అతడిపై ప్రశంసలు కురిపిస్తోంది. తను చనిపోతూ కూడా తన రెండుకళ్లను దానం చేశాడు ఈ హీరో.
పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియల మైసూర్ లో ఉన్న ఆయన ఫామ్ హౌస్ సమీపంలో నిర్వహించనున్నట్లు సమాచారం. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి, మాజీ ప్రైమ్ మినిష్టర్ హెచ్ డీ దేవ్ గౌడ, మరికొంతమంది స్టేట్ మినిస్టర్స్, సినీ సెలబ్రిటీలు రాజ్ కుమార్ ఇంటికి చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు.