భారీ అంచనాలతో డిసెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది సలార్. తెలుగు రెబల్ స్టార్.. పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్​ హీరోగా కేజీఎఫ్​ డైరక్టర్​ ప్రశాంత్​ నీల్ కాంబినేషన్​లో రూపొందిన ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించారు. మలయాళ సూపర్​స్టార్​ పృథ్వీరాజ్​ సుకుమారన్ ఇందులో విలన్​గా నటిస్తున్న విషయం మనకి తెలిసిందే. పృథ్వీరాజ్ పుట్టిన సందర్భంగా సలార్ మూవీలో ఆయనకు సంబంధించిన పోస్టర్​ను అన్ని బాషల్లో విడుదల చేసింది చిత్రబృందం.


సరిగ్గా ఏడాది క్రితం పృథ్వీరాజ్ లుక్​ని విడుదల చేసిన మూవీ టీమ్.. ఇప్పుడు విడుదల తేదీతో సహా పోస్టర్​ రిలీజ్ చేసింది. ప్రభాస్​ను ఢీకొట్టే విలన్​ పాత్రలో ఆయన నటిస్తున్నారు. సలార్ పార్ట్​ 1లో ప్రభాస్ పాత్ర నిడివి ఎక్కువగా ఉండగా.. పార్ట్​ 2లో మాత్రం పృథ్వీరాజ్ పాత్రకి ప్రాధాన్యత ఎక్కువగా ఉండనున్నట్లు చిత్రబృందం తెలిపింది. మలయాళంలో పృథ్వీరాజ్​కి ఉన్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెష్ చెప్తున్నారు.


ముందుగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయాలని ప్రయత్నించింది చిత్రబృందం. అప్పట్లో అధికారికంగానే ఈ విషయాన్ని వెల్లడించింది. కానీ అది కాస్త ఆలస్యమై.. డిసెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో ప్రభాస్, ప్రశాంత్ అండ్ టీమ్ పోస్ట్​ ప్రొడక్షన్స్ వర్క్స్​లో బిజీగా ఉన్నారు. హోంబలే ఫిలింస్ నుంచి నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్.. ఆద్య అనే పాత్ర పోషిస్తుంది. జగపతిబాబు కూడా ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. సలార్ సిరీస్ రెండు భాగాలుగా రాబోతుంది. అందులో మొదటి పార్ట్ ఏడాది చివరకి వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్​లో రిలీజ్​ కాబోతుంది. 


Also Read : ప్రభాస్ దెబ్బకి వెనక్కి తగ్గిన షారుఖ్, ఆగిపోయిన 'డంకీ' - సోలోగా వస్తోన్న 'సలార్'!


బాహుబలి తర్వాత ఎలాంటి హిట్​ కొట్టకపోయినా.. ఆదిపురుష్​లాంటి డిజాస్టర్​ తర్వాత కూడా ప్రభాస్ క్రేజ్ విషయంలో ఎలాంటి మార్పు రాలేదని సినిమా మార్కెట్ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్, కల్కి సినిమాలపైనే ఉన్నాయి. మారుతీ డైరక్షన్​లో మరో చిత్రం కూడా తెరకెక్కుతుంది. అయితే సలార్​ విషయంలో ప్రభాస్ క్రేజ్​తో పాటు ప్రశాంత్​ నీల్​ క్రేజ్​ కూడా నిర్మాతలకు బాగానే కలిసి రానుంది. కేజీఎఫ్​తో భారీ హిట్​ కొట్టిన డైరెక్టర్​.. కేజీఎఫ్​ వలె ఈ సినిమాను కూడా రెండు పార్ట్​లుగా రిలీజ్ చేస్తున్నారు. ఈ భారీ సినిమా విడుదల కోసం.. పెద్ద, చిన్నా తేడాలేకుండా కొన్ని చిత్రాలు తమ విడుదల తేదీని అడ్జెస్ట్ చేసుకున్నాయి. 


Also Read : ప్రభాస్ - మారుతి మూవీ నుంచి మరోసారి లీకైన ఫోటోలు - షాకింగ్ లుక్​లో డార్లింగ్!