Prashanth Varma Female Centric Movie: తక్కువ సినిమాలు చేసి ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆయన తాజాగా తెరకెక్కించిన ‘హనుమాన్’ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ సినిమా పెద్ద సినిమాలను సైతం వెనక్కి నెట్టి వసూళ్ల వర్షం కురిపించింది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా కేవలం 10 రోజుల్లోనే రూ. 200 కోట్లు వసూళ్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఫిమేల్ సెంట్రిక్ మూవీని తెరకెక్కిస్తున్న ప్రశాంత్ వర్మ
అటు ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి 12 సినిమాలు రాబోతున్నాయి. ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ ఇప్పటికే వెల్లడించారు. ఈ సినిమాల్లో భాగంగా ఓ సూపర్ ఉమెన్ మూవీ కూడా రాబోతుంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయ్యినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఓ సినిమా షూటింగ్ లో ఉందని ప్రశాంత్ వర్మ తెలిపారు. ఫిమేల్ సెంట్రిక్ సూపర్ హీరోయిన్ మూవీగా తెరకెక్కుతున్నట్లు వెల్లడించారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో అనే విషయంలో ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.
ఫిమేల్ సెంట్రిక్ సూపర్ హీరోయిన్ మూవీలో జ్ఞానేశ్వరి కాండ్రేగుల?
ప్రశాంత్ వర్మ లేటెస్ట్ మూవీలో జ్ఞానేశ్వరి కాండ్రేగుల హీరోయిన్ గా చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. జ్ఞానేశ్వరి ‘పెళ్లి చూపులు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నది. ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నది. కొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్ గానూ నటించింది జ్ఞానేశ్వరి. ‘మంత్ ఆఫ్ మధు’, ‘నీ జతగా’, ‘మాయలో’, ‘మిస్టర్ అండ్ మిస్’ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. పలు సిరీస్ లలోనూ యాక్ట్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్ఞానేశ్వరి ప్రశాంత్ వర్మ సినిమా గురించి కీలక విషయాలను వెల్లడించింది. ప్రశాంత్ వర్మ తీయబోయే సూపర్ వుమెన్ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
మూడు సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు
ఇక ప్రశాంత్ వర్మ చేసింది మూడు సినిమాలే అయినా దర్శకుడిగా అద్భుత గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ఆయన, తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత తేజ సజ్జా హీరోగా ‘జాంబీరెడ్డి’ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. రెండోసారి తేజ సజ్జతోనే ‘హనుమాన్’ అనే మూవీ చేసి అద్భుత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు. ‘హనుమాన్’ బ్లాక్ బస్టర్ నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ గా ‘జై హనుమాన్’ తెరకెక్కిస్తున్నాడు.
Read Also: బాక్సాఫీస్ దగ్గర తగ్గిన ‘హనుమాన్’ జోరు, 13వ రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?