HanuMan Day 13 Collections: ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబోలో వచ్చిన ‘హనుమాన్’ మూవీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. సినిమా విడుదలై రెండో వారంలోకి అడుగు పెట్టినప్పటికీ భారీగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలతో తరలి వస్తూనే ఉన్నారు. 10 రోజుల్లోనే రూ. 200 కోట్లు వసూళు చేసిన ఈ సినిమా తొలి వారంతో పోల్చితే రెండో వారంలో ఎక్కువ కలెక్షన్లు అందుకుంటుంది.


13వ రోజు ‘హనుమాన్’ కలెక్షన్స్ ఎంత అంటే?


సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు అనుకున్న సంఖ్యలో థియేటర్లు లభించలేదు. తెలంగాణతో పాటు ఆంధ్రాలోనూ పరిమిత స్క్రీన్లలో విడుదల అయ్యింది. తెలుగులో 450, హిందీలో 1500, ప్రపంచ వ్యాప్తంగా 2500 స్క్రీన్లలో సినిమా రిలీజ్ అయ్యింది. తొలి షో నుంచే ‘హనుమాన్’ మూవీకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. సినిమా చూసిన వాళ్లంతా అద్భుతం అన్నారు. ఈ సినిమాకు సంబంధించి పాజిటివ్ టాక్ లభించడంతో థియేటర్ల సంఖ్య నెమ్మదిగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 5 వేల స్క్రీన్లలో రన్ అవుతోంది. 13వ రోజు ఈ సినిమా 3.46 కోట్లు వసూళు చేసింది. 12వ రోజు రూ. 4.65 కోట్లు వసూళు చేయగా 13వ రోజుకు వచ్చే సరికి 33 శాతం వసూళ్లు తగ్గాయి. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ‘హనుమాన్’ సినిమా రూ. 101 కోట్లు, కర్ణాటకలో  రూ. 17 కోట్లు, తమిళనాడులో రూ. 3 కోట్లు,  కేరళలో రూ. కోటి, హిందీలో  రూ. 45 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 13 రోజుల్లో  రూ. 165 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది.


జనవరి 25 ఆక్యుపెన్సీ ఎలా ఉందంటే?


ఇక ఈ సినిమాకు సంబంధించిన ఆక్యుపెన్సీ ఫర్వాలేదు అనిపిస్తోంది. ఇవాళ ఈ మూవీ మార్నింగ్ షోకు 20 శాతం,  మ్యాట్నీకి 23 శాతం, ఫస్ట్ షోకు 30 శాతం, సెకండ్ షోకు 35 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది. అత్యధికంగా మహబూబ్ నగర్‌లో 74 శాతం, కాకినాడలో 55 శాతం, వైజాగ్‌లో 45 శాతం, వరంగల్‌లో 35 శాతం, హైదరాబాద్‌లో 30 శాతం ఆక్యుపెన్సీని సాధించింది.


‘జై హనుమాన్’ పనులు షురూ


‘హనుమాన్‌’ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్‌ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించారు.  అంజనాద్రి అనే ఊహాజనిత గ్రామంలో ఈ కథ జరుగుతుంది. ఓ సాధారణ యువకుడికి  ఆంజనేయుడి ద్వారా పవర్స్ వస్తే ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమాలో చూపించారు. ఓ వైపు ‘హనుమాన్’ మూవీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుండగానే, మరోవైపు ‘జై హనుమాన్’ ప్రీప్రొడక్షన్ పనులు  మొదలు పెట్టారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.






Read Also: ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్ డేట్, తారక్ పాత్ర అలా ఉంటుందట