విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా కీలక ప్రకటన చేశారు. కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ (అప్పు) సేవలను తన ఫౌండేషన్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. నా స్పెషల్ డే రోజున మీ అందరితో ఈ శుభవార్త పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందని చెబుతూ.. పునీత్ రాజ్ కుమార్ ప్రారంభించిన సేవలను ఇకపై ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ముందుకు తీసుకెళ్లబోతున్నట్లు చెప్పారు.
త్వరలోనే మరిన్ని వివరాలను ప్రకటిస్తానని చెప్పారు. పునీత్ రాజ్ కుమార్ కి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ఆ ఫొటోలపై 'అప్పు ఎక్స్‌ప్రెస్' అని రాసి ఉంది. ఈ పోస్ట్ పై నెటిజన్లు, పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ప్రకాష్ రాజ్ పై ప్రశంసలు కురిపిస్తూ.. ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. కరోనా సమయంలో ప్రకాష్ రాజ్ చాలా మందికి సాయం చేశారు. తన ఫామ్ హౌస్ లో ఎందరికో ఆశ్రయం కల్పించారు.
నటుడిగా ఎంత బిజీగా ఉన్నా.. రాజకీయంగా, సేవా కార్యక్రమాల్లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు సామాజిక అంశాలపై స్పందిస్తూనే ఉంటారు. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ సేవలను తన బాధ్యతగా తీసుకొని కొనసాగించాలని అనుకుంటున్నారు ప్రకాష్ రాజ్. ఇలాంటి సేవా కార్యక్రమాలను ఆయన మరిన్ని చేపట్టాలని కోరుకుందాం!
Also Read: స్టార్ హీరో విజయ్ చనిపోయాడంటూ ట్రోలింగ్, యాంటీ ఫ్యాన్స్ దారుణమైన కామెంట్స్
Also Read: సమంత దూకుడుకు సాటెవ్వరు? విడాకుల తర్వాత బ్రాండ్ వేల్యూ పెరిగిందా?