Kovvur Accident : పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఒకదాని వెనుక ఒకటిగా ఆరు లారీలు పరసస్పరం ఢీకొన్నాయి. లారీల(Lorry) మధ్యలో చిక్కుకుని ఓ కారు(Car) నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఒక వ్యాన్ లోని పాస్పరస్ డైక్లోరైడ్ ద్రావణం లీకవుతుంది. ఇది విషవాయువుగా మారే ప్రమాదం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాయువు లీక్ అవుతున్న వాహనాన్ని వేరే ప్రాంతానికి తరలించారు ఫైర్ సిబ్బంది.  6 వాహనాలు ఒకదానితో ఒకటి వెనక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆరు వాహనాల్లో 2 ప్రమాదకరమైన రసాయనాలను తీసుకువెళ్లే వాహనాలు కావడంతో కొంత ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయచర్యలు చేపట్టారు. 


ప్రాణనష్టం తప్పింది, ఇద్దరు డ్రైవర్లకు గాయాలు 


ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు కొవ్వూరు ఆంధ్ర షుగర్స్ సిబ్బంది.  కొవ్వూరు(Kovvur) అగ్నిమాపక సిబ్బంది, ఆంధ్ర షుగర్స్(Andhra Sugars) భద్రత అధికారులు 2 లారీలలో ఉన్న ట్రై క్లోరో ఫాస్పేట్, మిథనాల్ డై క్లోరైడ్  వల్ల ప్రజలకు హాని కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇంత భారీ రోడ్డు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. లారీ డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఉదయం నుంచి  ట్రాఫిక్ క్రమబద్దీకరించి, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎస్ఐ కె .రామకృష్ణ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. టోల్ గేట్(Toll Gate) లో ఫాస్ట్ ట్రాక్ లేకపోవడంతో నిత్యం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఇప్పటికైనా కొవ్వూరు గమన్ టోల్ గేట్ లో ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేసి, సిబ్బందిని అందుబాటులో ఉంచేలా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. 


ప్రమాదకర కెమికల్స్ లీక్ 


"ఇవాళ ఉదయం మాకు ఈ ప్రమాదం గురించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(Pollution Control Board) నుంచి ఫోన్ వచ్చింది. ప్రమాదంలో కెమికల్స్ లీక్ అవుతున్నాయని చెప్పారు. మేము ఇక్కడికి వచ్చ చూస్తే ఓ లారీ పాస్పరస్ ట్రై క్లోరైడ్ డ్రమ్స్ ఉన్నాయి. అవి లీకవుతున్నాయి. ట్రక్ లో గుద్దుకోవడం వల్ల కెమికల్స్ లీకవుతున్నాయి. డ్రైవర్ వద్ద ఉన్న పేపర్స్ తీసుకుని ఎక్కడికి ఎగుమతి అవుతుందో వాళ్లకు కాల్ చేశాం. వాళ్లు డ్రై యాష్ స్పిల్ చేయాలని చెప్పారు. డ్రై యాష్ అందుబాటులో లేని కారణంగా మట్టిని జల్లుతున్నాం. నీరు చల్లిలో పెద్ద ఎత్తున్న మంటలు వ్యాపిస్తాయని తెలుస్తోంది. దీంతో ఆ వాహనాలను ఊరికి దూరంగా తరలించాం. పొల్యుషన్ కంట్రోల్ బోర్డు సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఇక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు." - కేవీవీ సత్యనారాయణ మూర్తి, ఆంధ్ర షుగర్స్ సేఫ్టీ మేనేజర్ 



(కేవీవీ సత్యనారాయణ మూర్తి, ఆంధ్ర షుగర్స్ సేఫ్టీ మేనేజర్)


విజయనగరం జిల్లాలో బోల్తా పడిన లారీ 


విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం డుమంగి గ్రామ సమీపంలో విశాఖ నుంచి ఒడిశా రాయపూర్ బిగ్గులోడుతో వెళ్తోన్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ లారీ కేబిన్ లో చిక్కుపోవడంతో డ్రైవర్ ను  కాపాడేందుకు స్థానికులు, పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. సుమారు నాలుగు గంటల పాటు శ్రమించిన అనంతరం డ్రైవర్ ను ప్రాణాలతో బయటకు తీయగలిగారు.  డ్రైవర్ కు కాలు విరిగినట్టు గుర్తించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అతడిని మెరుగైన చికిత్స కోసం పార్వతీపురం తరలించారు. అదేలారీలో ఉన్న క్లీనర్ సురక్షితంగా బయట పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.