కన్నడ హిట్ సినిమా 'కాంతారా' (Kantara Movie )ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) చూశారు. సారీ... 'సలార్' చూశారు. ఆయన కోసం హోంబలే  ఫిలింస్ సంస్థ స్పెషల్ షో వేశారు. ఎందుకంటే... 'కాంతారా' నిర్మించిన హోంబలే సంస్థ, ఇప్పుడు ప్రభాస్ కథనాయకుడిగా 'సలార్' సినిమా (Salaar Movie) ను ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ రెండు సినిమాలకు నిర్మాత విజయ్ కిరగందూర్. ప్రభాస్ సినిమా చూడటం వెనుక అసలు సంగతి అది! త్వరలో ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ప్రభాస్ పోస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.


ప్రసాద్ ల్యాబ్స్‌లో...
ప్రభాస్‌కు స్పెషల్ షో!
'కాంతారా' (Kantara) సినిమా సెప్టెంబర్ 30న విడుదలైంది. కర్ణాటకలో మాత్రమే కాదు... ఇతర రాష్ట్రాల్లోనూ సినిమా విడుదలైంది. కన్నడ ప్రేక్షకులు మాత్రమే కాదు... సినిమా చూసిన ఇతర భాషల ప్రేక్షకులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడీ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో విడుదలకు రెడీ అయ్యింది. ప్రభాస్ చూసింది కూడా 'కాంతారా' తెలుగు వెర్షన్! ప్రభాస్ ల్యాబ్స్‌లో గురువారం రాత్రి ఆయనకు స్పెషల్ షో వేశారు. 


ప్రభాస్ కాకుండా మరో ముగ్గురు నలుగురు మాత్రమే సినిమా చూశారు. ఆయనతో  పాటు ల్యాబ్స్‌లో ఉన్నారని సమాచారం. సినిమా చూశాక... చాలా బావుందని ప్రభాస్ మెచ్చుకున్నట్లు తెలుస్తోంది. 
 
తెలుగు సినిమాను విడుదల చేస్తున్న అల్లు అరవింద్
Kantara Telugu Release : 'కాంతారా' తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. ఈ నెల 15న... అనగా రేపే (శనివారం) థియేటర్లలో విడుదల చేస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తుండటంతో... తెలుగు ప్రేక్షకులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. 


Kantara Meaning : 'కాంతారా' అనేది సంస్కృత పదం! అంటే... అడవి అని అర్థం! అడవి తల్లిపై మనం ఎంత ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను... ఎంత విధ్వంసం సృష్టిస్తే... అంతకు మించి ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వడం అనే కథాంశంతో 'కాంతారా' సినిమా రూపొందింది. 


Also Read : 'క్రేజీ ఫెలో' రివ్యూ : ఆది సాయి కుమార్ సినిమా క్రేజీగా ఉందా? బోర్ కొట్టించిందా?



'కాంతారా'లో రిషబ్ శెట్టి (Rishab Shetty) కథానాయకుడు. అంతే కాదు... ఈ చిత్రానికి ఆయనే దర్శకుడు కూడా! అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. 'కెజియఫ్' రెండు భాగాలతో దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ నిర్మించిన చిత్రమిది. రిషబ్ శెట్టి తెలుగు ప్రేక్షకులకు కొత్త గానీ... కిశోర్ కుమార్ తెలుగులో చాలా సినిమాలు చేశారు. 'ఛలో' సినిమాలో అచ్యుత్ కుమార్ కనిపించారు. 



రిషబ్ శెట్టి, కిశోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, ప్రకాశ్ తుమినాడు, మానసి సుధీర్, శనిల్ గురు, దీపక్ రాయ్ పనాజే తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : అరవింద్ ఎస్ కశ్యప్, కూర్పు : ప్రతీక్ శెట్టి, కె ఎం ప్రకాష్, సంగీతం - అజనీష్ లోకనాథ్, తెలుగులో పంపిణీ - గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, నిర్మాత: విజయ్ కిరగందూర్, దర్శకత్వం : రిషబ్ శెట్టి.