Reliance - Metro India: దేశీయ రిటైల్ రంగ వ్యాపారంలో ఆధిపత్య స్థానం కోసం ఆరాటపడుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL), అందుకోసం ఎంచుకున్న ప్రధాన మార్గం అక్విజిషన్లు. కిరాణా వ్యాపారంలో కాస్త తడబడుతున్న ప్రతి కంపెనీపై కన్నేసి, నయాన్నో - భయాన్నో చేజిక్కించుకుంటోందీ జెయింట్.
రిలయన్స్ తాజా టార్గెట్ మెట్రో (Metro). నగరాల్లో ఉంటున్నవారికి. నగరాలను చుట్టొచ్చేవాళ్లకు మెట్రో హోల్‌సేల్ స్టోర్లు సుపరిచితమే. ఇది జర్మనీకి చెందిన చారోన్ పోక్‌ఫాండ్ గ్రూప్ (Charoen Pokphand Group) కంపెనీ. భారత్‌లో వ్యాపారం చేయడానికి బాగా ఇబ్బంది పడుతోంది. ఈ కంపెనీని కొనుగోలు చేయడానికి రిలయన్స్ తుది చర్చలు జరుపుతోంది.
సోలో బిడ్డర్
ఈ 'క్యాష్ అండ్ క్యారీ' బిజినెస్‌ను చేజిక్కించుకునే రేస్‌లో రిలయన్స్ మాత్రమే ఉంది. ఈ కంపెనీ మాత్రమే బిడ్ వేసింది. కాబట్టి, రిలయన్స్ చేతికి మెట్రో చిక్కడం దాదాపుగా ఖాయమైనట్లే. ఒక నెలలోగా తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.
థాయ్‌లాండ్‌కు చెందిన సీపీ గ్రూపు (CP Group), అమెజాన్ (Amazon.com Inc) కూడా మెట్రో వ్యాపారం కోసం మొగట పోటీ పడినా, సెకండ్ రౌండ్ చర్చల సమయానికి అవి సైడయ్యాయి. దీంతో, రిలయన్స్ సోలో బిడ్డర్‌గా నిలిచింది.
1-1.2 బిలియన్ డాలర్ల డీల్
అప్పులతో కలిపి మెట్రో ఏజీ భారత్ వ్యాపారం విలువ 1- 1.2 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.8200- 9840 కోట్లు) డీల్ కుదిరే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ డీల్ గురించి అటు మెట్రో గానీ, ఇటు రిలయన్స్ ప్రతినిధులు గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు.
దేశవ్యాప్తంగా 31 స్టోర్లు
2003లో, ఇండియన్ మార్కెట్లోకి మెట్రో ప్రవేశించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 31 హోల్‌సేల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను నిర్వహిస్తోంది. బిజినెస్ కస్టమర్లకు మాత్రమే (హోల్‌సేల్ బిజినెస్) ప్రస్తుతం సేవలు అందిస్తోంది. దీని ప్రధాన క్లయింట్లలో హోటళ్లు, రెస్టారెంట్‌లు, స్మాల్ రిటైలర్స్ ఉన్నాయి.
రిలయన్స్ ఇప్పటికే దేశంలో అతి పెద్ద రిటైల్ సామ్రాట్, బలమైన హోల్‌సేల్ యూనిట్. దేశంలో దాని వ్యాపార పునాదులను మరింత లోతుకు తీసుకువెళ్తోంది. చేస్తుంది. CP గ్రూప్ మరియు రిలయన్స్‌తో పాటు, మెట్రో యొక్క సంభావ్య నగదు మరియు క్యారీ వ్యాపార విక్రయం Amazon.com Inc. నుండి కూడా ఆసక్తిని కలిగి ఉంది, బ్లూమ్‌బెర్గ్ న్యూస్ జూలైలో నివేదించింది.
రిలయన్స్ షేర్ ధర
గురువారం నాటి ముగింపు రూ.2382తో పోలిస్తే, ఇవాళ (శుక్రవారం) రిలయన్స్ షేర్ ధర 2,415 దగ్గర ఓపెన్ అయింది. ఉదయం 10.35 గంటల సమయానికి 0.50 శాతం లాభంతో రూ.2,393 దగ్గర ట్రేడవుతోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.