Aakashavani Trailer: అశ్విన్ గంగరాజు దర్శకుడిగా తెరకెక్కిస్తోన్న వైవిధ్యభరితమైన కథా చిత్రం 'ఆకాశవాణి'. ప్రముఖ నటుడు సముద్రఖని ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 24న 'సోనీ లైవ్' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)తో రిలీజ్ చేయించారు. ట్రైలర్ ను బట్టి ఇదొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అని అర్ధమవుతోంది. ఓ రేడియో చుట్టూ దట్టమైన అడవిలో జరిగే ఆసక్తికరమైన కథతో ఈ చిత్రం రూపొందుతోంది.
Also Read: హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం..
'మనం బతికినా.. సచ్చినా.. తిన్నా.. పత్తున్నా.. ఎవరి వల్లా..? దేవుడి వల్ల, దొర వల్ల' అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఆ తరువాత ఒక దొర ఒక గూడెంను గుప్పిట్లో పెట్టుకున్న సన్నివేశాలు చూపించారు. 'గొర్రెలకు కొమ్ములు.. గూడేనికి దమ్ములు ఉండకూడదు' అనే డైలాగ్ కథ ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పింది. 'తప్పు చేసిన వాడికంటే చూస్తూ ఊరుకున్నవాడిదే పెద్ద తప్పు' అనే డైలాగ్ హైలైట్ గా నిలిచింది.
ఈ చిత్రానికి ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందించారు. కాల భైరవ సంగీతం సమకూర్చారు. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ అందించగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఏయూ అండ్ ఐ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఎ.పద్మనాభరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read: ఉమాదేవి ఔట్.. ఎమోషనల్ అయిన ప్రియాంక..