Prabhas Maruthi Movie First Look Update: ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. సంక్రాంతికి సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డిసెంబర్ నెలాఖరులో చెప్పింది. ఇప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ అండ్ టైం అనౌన్స్ చేసింది. 


పెద్ద పండక్కి సందడి షురూ...
సోమవారం ఉదయం 07.08కి!
సంక్రాంతి పండుగ సోమవారం వచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఆ రోజు మరింత స్పెషల్. ఎందుకంటే... ఈ నెల 15న ఉదయం 07.08 గంటలకు సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. పెద్ద పండుగ రోజు ఎర్లీ మార్నింగ్ ప్రభాస్ సందడి మొదలు కానుంది. 


Raja Deluxe Prabhas Movie: ప్రభాస్, మారుతి సినిమా టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే... ఈ సినిమాకు 'రాజా డీలక్స్' టైటిల్ ఖరారు చేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఫస్ట్ లుక్ విడుదలతో పాటు టైటిల్ కూడా అనౌన్స్ చేయనున్నారు. ఇదొక హారర్ కామెడీ సినిమా.


Also Read: సైంధవ్ రివ్యూ : సైకోగా వెంకటేష్ ఎలా చేశారు? ఆయన 75వ సినిమా హిట్టా? ఫట్టా?






ప్రభాస్ జోడీగా నటిస్తున్న హీరోయిన్లు ఎవరంటే?
ప్రభాస్, మారుతి సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో ఒకరు నిధి అగర్వాల్. ఆల్రెడీ ఆమె 'ఇస్మార్ట్ శంకర్'తో పాటు కొన్ని సినిమాలు చేశారు. మరొక హీరోయిన్ మాళవికా మోహనన్. తమిళ డబ్బింగ్ సినిమాలతో ఆమె కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే... తెలుగులో ఆమెకు తొలి సినిమా ఇది. 'రాధే శ్యామ్' సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన రాజ్ తరుణ్ 'లవర్స్' ఫేమ్ రిద్ధి కుమార్ మరొక హీరోయిన్.


Also Readగుంటూరు కారం రివ్యూ: మహేష్ బాబు ఎనర్జీ & ఆ మాస్ సూపర్, మరి సినిమా?


ప్రేమ కథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతి రోజూ పండగే సినిమాల్లో మారుతి మంచి వినోదం పండించారు. 'బుజ్జిగాడు మేడిన్ చెన్నై' చూస్తే ప్రభాస్‌ కామెడీ టైమింగ్‌ తెలుస్తుంది. అందువల్ల, మారుతి దర్శకత్వంలో ప్రభాస్ అనగానే అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా చాలా రోజుల తర్వాత రెబల్ స్టార్ కామెడీ టైమింగ్ చూడవచ్చని ఆశిస్తున్నారు.


Also Readకాథల్ ది కోర్ రివ్యూ: అమెజాన్ ఓటీటీలో మమ్ముట్టి గే రోల్ చేసిన సినిమా... జ్యోతిక డామినేట్ చేసిందా?



'రాజా డీలక్స్' సినిమాలో యోగి బాబు!
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ప్రముఖ తమిళ హాస్య నటుడు యోగి బాబు కూడా 'రాజా డీలక్స్' సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో డబ్బింగ్ అయిన పలు తమిళ సినిమాల్లో ఆయన నటించారు. తన కామెడీతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా నవ్వించారు. ఇప్పుడు ఆయన డైరెక్ట్ తెలుగు సినిమాలో నటిస్తున్నారు. ప్రభాస్ మారుతి సినిమాలో తాను ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు యోగి బాబు ఓ తమిళ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆల్రెడీ ఆయన షూటింగ్ కూడా చేశారట.