Prabhas Hanu Ragavapudi Movie Story Line: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’ మూవీ చేస్తున్న ప్రభాస్, ‘సలార్’ సీక్వెల్ లోనూ నటిస్తున్నారు. తాజా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడితో కలిసి ఓ సినిమా చేబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి  పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది.


హిస్టారికల్ ఫిక్షన్ చిత్రంగా..


ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో వస్తున్న ఈ సినిమా హిస్టారికల్ ఫిక్షన్ మూవీగా రూపొందనుంది. 1940లో జరిగిన యాథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్ గా వెల్లడించింది. “ఆధిపత్యం కోసం యుద్ధం జరిగినప్పుడు, ఓ యోధులు దేని కోసం పోరాటం చేశారో చెప్పబోతున్నాడు. 1940 నాటి హిస్టారికల్ ఫిక్షన్ గా ప్రభాస్, హను మూవీ తెరకెక్కబోతోంది” సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది.






1940లో ఏం జరిగిందంటే?


1940లో ప్రపంచ వ్యాప్తంగా పలు చారిత్ర ఘటనలు జరిగాయి. జర్మన్ విమానం ఫిబ్రవరి 3, 1940న ఇంగ్లాండ్ మీదుగా వెళ్తుండగా కూల్చివేయబడింది . ఆ తర్వాత జరిగిన పరిణామాలు రెండో ప్రపంచ యుద్ధానికి దారి తీశాయి. అదే ఏడాది జర్మనీ దండెత్తి పలు దేశాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. రెండో ప్రపంచ యుద్ధం, భారత్ కు లింకు పెట్టి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. 1940లో భారత స్వాతంత్ర్య పోరాటం కోసం రూపుదిద్దుకున్న ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ బేస్ చేసుకుని ఈ సినిమా కథను రాసినట్లు సమాచారం. అంతేకాదు, ఈ మూవీకి ‘పౌజీ’ అనే పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ లో సైనికుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ వెట‌ర‌న్ యాక్ట‌ర్ మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, సీనియ‌ర్ నటి జ‌య‌ప్ర‌ద కీలక పాత్రలు పోషించబోతున్నారు. ఈ సినిమాకు విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందించబోతున్నారు. 


‘కల్కి 2898 ఏడీ’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్


ఇక ప్రభాస్ రీసెంట్ గా ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. ఈ చిత్రం ఏకంగా రూ. 1200 కోట్లు వసూళు చేసింది. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. దీపికా పదుకొణె, దిశా పఠానీ హీరోయిన్లుగా కనపించారు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టారు. రీసెంట్ గా వీడియో గ్లింప్స్ వదిలారు. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తుండగా, మాళ‌వికా మోహ‌న‌న్‌, నిధి అగ‌ర్వాల్ ఫీమేల్ లీడ్స్ పోషిస్తున్నారు.


Read Also: ఒక్క వీడియోతో నెట్టింట సెన్సేషన్‌, కట్‌ చేస్తే ప్రభాస్‌-హను సినిమా హీరోయిన్‌ - ఇంతకీ ఎవరీ ఇమాన్వీ!