Iman Esmail: ఒక్క వీడియోతో నెట్టింట సెన్సేషన్, కట్ చేస్తే ప్రభాస్-హను సినిమా హీరోయిన్ - ఇంతకి ఎవరీ ఇమాన్వీ!
Who Is Iman Esmail Aka Imanvi Photos Viral: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, 'సీతారామం' ఫేం హను రాఘవపూడిల సినిమా ఇవాళ లాంఛనంగా ప్రారంభం అయ్యింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ కార్యక్రమంలో ప్రభాస, హను, మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా మైత్రీ నిర్మాణ సంస్థ షేర్ చేసింది. అయితే ఇందులో ప్రభాస్ పక్కన ఓ కొత్త అమ్మాయి కనిపించింది.
దీంతో ఈ సినిమాలో ఆమె హీరోయిన్ అని అర్థమైపోతుంది. ఇంతకు ముందు ఏ సినిమాలోనూ ఆమె చూడలేదు. హను రాఘవపూడి తన సినిమాలో ప్రధానం కొత్త వాళ్లకే ప్రిఫరెన్స్ ఇస్తారనే విషయం తెలిసిందే.
ఇప్పుడు అలాగే ఈసారి కూడా ప్రభాస్ కోసం కొత్త అమ్మాయిని తీసుకువచ్చారు. ఆమె పేరు ఇమాన్ ఇస్మాయిల్ అలియాస్ ఇమాన్వీ. ఢిల్లికి చెందిన ఈ అమ్మాయి.. సోషల్ మీడియా ద్వారా బాగా పాపులరైంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో తన డ్యాన్స్ వీడియోలతో భారీగా ఫాలోవర్సని సంపాదించుకుంది. అలాగే ఎక్స్(X)లోనూ ఆమె ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇప్పటి వరకు ఆమె ఏ సినిమాలోనూ కనిపించలేదు.
కానీ, సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న క్రేజ్‌తో హను రాఘవపూడి ప్రభాస్ సరసన ఆమెకు హీరోయిన్ చాన్స్ ఇచ్చాడట. దీంతో ఇమాన్వీ ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా నిలిచింది.
దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇమాన్వీ అద్భుతమైన డ్యాన్సర్. ప్రస్తుతం ప్రైవేట్ కొరియోగ్రాఫర్ కొనసాగుతుంది.
అప్పట్లో ఓ డ్యాన్స్ వీడియోతో ఆమె సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యింది. ఇందులో ఇమాన్వీ ఓ యువకుడితో మలయాళ పాపులర్ పాటకు స్టేప్పులేసి వైరల్ అయ్యింది.
ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన చాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఇమాన్వీ అమెరికాలో ఉంటుందట. ప్రభాస్‌తో సినిమా కోసమే ఆమె ఇండియాకు వచ్చినట్టు తెలుస్తోంది.
కాగా ఈ ప్రాజెక్ట్‌పై అనౌన్స్‌మెంట్ రాగానే ప్రభాస్ సరసన పాకిస్తానీ నటి సజల్ అలీ నటిస్తున్నట్టు ప్రచారం జరిగింది. కానీ అవి వార్తలకే పరిమితం అయ్యాయి.
సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా ఫైనల్ అయ్యిందన్నారు. తాను ప్రభాస్‌తో ఎలంటి సినిమా చేయడం లేదని నేరుగా స్పందించి ఈ వార్తలకు చెక్ పెట్టింది. చూస్తే ఇప్పుడు కొత్త అమ్మాయి తెరపైకి వచ్చింది.
ఒక్క వీడియోతో నెట్టింట సెన్సేషన్, కట్ చేస్తే ప్రభాస్-హను సినిమా హీరోయిన్ - ఇంతకీ ఎవరీ ఇమాన్వీ!