రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 'ప్రాజెక్ట్ కె' (Project K) దర్శకుడు నాగ్ అశ్విన్, చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ మీద మండి పడుతున్నారు. ప్రభాస్ పుట్టిన రోజు నాడు తమను తీవ్ర నిరాశకు గురి చేశారని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కొందరు అయితే బూతులు కూడా తిడుతున్నారు. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
ప్రభాస్ పుట్టినరోజు (Prabhas Birthday) సందర్భంగా ఈ రోజు 'ప్రాజెక్ట్ కె' నుంచి స్మాల్ అప్‌డేట్ ఇస్తామని నిన్న నాగ్ అశ్విన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దాంతో అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చేశారు. ఆ అప్‌డేట్ ఏమై ఉంటుందోనని కొందరు రాత్రి నిద్రపోలేదు కూడా! అయితే, వాళ్ళకు వైజయంతి మూవీస్ నుంచి వచ్చిన ఒక పోస్ట్ షాక్ ఇచ్చింది.
Prabhas Birthday Wishes : ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ 'ప్రాజెక్ట్ కె' సెట్స్‌లో ఫైర్ క్రాకర్స్ కాల్చి ఆ వీడియో విడుదల చేసింది వైజయంతి మూవీస్. అది చూసిన అభిమానులకు కోపం వచ్చింది. 'ఇదేంటి?' అంటూ ట్విట్టర్‌లో రిప్లైలు, ఇన్‌స్టాగ్రామ్‌లో & ఫేస్‌బుక్‌లో కామెంట్స్‌తో తాము ఎంతగా డిజప్పాయింట్ అయ్యిందీ చెప్పడం స్టార్ట్ చేశారు.
'ఇదేనా అప్‌డేట్?' అంటూ కొందరు షాక్ అయితే... మరికొందరు 'ఇది అప్‌డేట్ అయ్యి ఉండదులే. జస్ట్ విష్ చేశారు. అప్‌డేట్ వస్తుంది' అని కామెంట్స్ చేశారు. చాలా మంది బూతులు తిట్టారు. గతంలో యువి క్రియేషన్స్ కూడా 'సాహో', 'రాధే శ్యామ్' సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి ఇటువంటి ఆగ్రహాన్ని చవి చూసింది. అప్‌డేట్ చెప్పిన సమయానికి ఇవ్వకపోయినా... ఇచ్చిన అప్‌డేట్ తమకు నచ్చకపోయినా... సోషల్ మీడియాలో తిట్టేవారు. ఇప్పుడు వైజయంతి మూవీస్, నాగ్ అశ్విన్ వంతు వచ్చింది.
అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన హ్యాండ్ లుక్ విడుదల చేశారు. కనీసం అటువంటి లుక్ అయినా వస్తుందని కొందరు వెయిట్ చేశారు. అదీ కాకుండా కేవలం బాణాసంచా కాల్చి శుభాకాంక్షలు చెప్పడంతో అభిమానులు మండి పడుతున్నారు.
ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ (Deepika Padukone) జంటగా సినిమా 'ప్రాజెక్ట్ కె' (Project K Movie)లో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర చేస్తున్నారు. అక్టోబర్ 18, 2023న... ఒకవేళ ఆ తేదీకి విడుదల చేయడం కుదరకపోతే 2024 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకుంటున్నట్లు అశ్వినీదత్ వెల్లడించారు.
Also Read : ప్రభాస్ 'నో' చెప్పడం నేర్చుకోవాలా? మొహమాటాలు వదిలేయకపోతే ఫ్లాప్స్ తప్పవా?
హీరోయిన్ దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె' చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తెరపై రానటువంటి కథాంశంతో 'ప్రాజెక్ట్ కె' తెరకెక్కుతోందని టాక్. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందుతోంది.