Horoscope Today 23rd October 2022 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.


మేషరాశి 
మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఏదో విషయంలో భయం, ఆందోళన మిమ్మల్ని వెంటాడుతుంది. కొన్ని విషయాల్లో  రిస్క్ తీసుకోకుండా ఉండటం మంచిది. గాయం, ప్రమాదం, దొంగతనం ఏదో ఒకదానివల్ల ఆర్థిక నష్టం ఉంటుంది. 


వృషభరాశి 
ఉద్యోగులు పనిచేసే ప్రదేశంలో అనవసర ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. దూరప్రాంత ప్రయాణం చేసేవారికి అంతా శుభం జరుగుతుంది. ఓ గుడ్ న్యూస్ వింటారు. కష్టపడితేనే ఫలితం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అనారోగ్యంతో బాధపడతారు. అధికారిక పనులతో సంబంధం ఉన్న వ్యక్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది.


మిథున రాశి
ఎప్పటి నుంచో వెంటాడతున్న వివాదాలు ఈరోజు పరిష్కారమవుతాయి. ఇంట్లో మీరు సంతోషాన్ని పొందుతారు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. గౌరవం పెరుగుతుంది. పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. మీ మనస్సులో ఎలాంటి సంకోచాన్ని ఉంచుకోకండి.


Also Read: దీపావళికి పెట్టే దీపాల్లో శనిదోషం తొలగించుకునేందుకు పెట్టేదీపం వేరే!


కర్కాటక రాశి
మీలో మీరు చిన్న చిన్నమార్పులు చేసుకోవడం ద్వారా కుటుంబ సభ్యుల మనసు గెలుచుకోగలుగుతారు. మీరు తలపెట్టిన పనుల్లో కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం ఉంటుంది. మానసికంగా ఆనందంగా ఉంటారు. ఆర్థిక నష్టాలు తగ్గాలంటే రిస్క్ తీసుకోకుండా ఉండాలి. డబ్బు సంపాదన సులువు అవుతుంది. ఉద్యోగులు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 


సింహ రాశి 
అనుకోకుండా చేసిన పొరపాటు వల్ల మీరు తలపెట్టిన పనిలో ఆటంకం కలుగుతుంది. వ్యాపారంలో రిస్క్ తీసుకోకుండా ఉండటం మంచిది. ఖర్చులు పెరగుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోపోవడం చాలా మంచిది. తండ్రితో వివాదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త..మాట తూలకండి.


కన్యారాశి 
ఈ రోజు ఆనందంగా ప్రారంభమవుతుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బు పొందే అవకాశం ఉంది.పెట్టుబడులకు ఇది అనుకూల సమయం. భయం, ఆందోళన వెంటాడుతుంది. ఉద్యోగస్తులకు చిన్నచిన్న ఇబ్బందులు తప్పవు.


Also Read: దీపాలతో లక్ష్మీదేవికి పలికే ఆహ్వానమే దీపావళి, ఈ చిన్న చిన్న పొరపాట్లు చేయొద్దు!


తులారాశి
వ్యాపారాల్లో ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. దినచర్యలో మార్పుల మధ్య కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. పని తీరులో మార్పులు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. తల్లికి అనారోగ్య సూచనలున్నాయి కేర్ తీసుకోండి. 


వృశ్చిక రాశి 
ఇంట్లో సమస్యలు తగ్గించేందుకు ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు మార్చుకునేందుకు ప్రయత్నించండి. మీ కారణంగా జీవిత భాగస్వామి ఆందోళన చెందుతారు. తంత్ర-మంత్రాలపై ఆసక్తి  పెరుగుతుంది. తీర్థయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. 


ధనుస్సు రాశి 
ఈ రాశివారికి ఈ రోజు ప్రేమ వ్యవహారాల్లో విజయావకాశాలు ఉన్నాయి. అగ్ని-వాహన-యంత్రాల వినియోగంలో జాగ్రత్తగా ఉండండి. వివాదాలకు దూరంగా ఉండండి. గతంలో చేసిన కొన్ని తప్పులు హాని కలగించవచ్చు. రిస్క్ తీసుకోకండి. పాత రోగాలు మళ్లీ రావొచ్చు.


మకర రాశి 
మీరు మనశ్శాంతి పొందుతారు. ప్రేమ వ్యవహారంలో అనుకూలత ఉంటుంది. డబ్బు సంపాదించడం సులభం అవుతుంది. అనారోగ్యం బాగానే ఉంటుంది. వివేకవంతమైన చర్యలు లాభాలను అందిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహన యోగం ఉంటుంది. 


కుంభరాశి
మతపరమైన ఆచార వ్యవహారాలపై ఆసక్తి పెరుగుతుంది. శత్రువులు ప్రశాంతంగా ఉంటారు. ఆస్తి పనుల్లో లాభాలతోపాటు పురోగతి ఉంటుంది. శారీరక నొప్పితో బాధపడతారు. వ్యాపారులకు పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. సంతాన సంతోషం సాధ్యమవుతుంది.


మీన రాశి 
మీ ఆలోచనలను అదుపులో ఉంచుకోండి. మీకు పుణ్యాత్ముల సాంగత్యం లభిస్తుంది. అసమతుల్యతను నివారించండి. తెలివిగా వ్యవహరించండి లాభం ఉంటుంది. మీకు ఇష్టమైన ఆహారాన్ని మీరు ఆనందిస్తారు. విద్యార్థులకు మంచి రోజు.