ప్రభాస్ (Prabhas Birthday) సందర్భంగా 'ఆదిపురుష్' (Adipurush) చిత్ర బృందం అభిమానులకు చిరు కానుక ఇచ్చింది. సినిమా నుంచి కొత్త స్టిల్, పోస్టర్ విడుదల చేసింది. అభిమానులు చాలా మందికి ఇది సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే...
Prabhas Birthday Special Poster From Adipurush : 'ఆదిపురుష్' నుంచి ఆల్రెడీ ప్రభాస్ లుక్ విడుదల అయ్యింది. టీజర్‌లో లుక్ ఎలా ఉంటుందనేది చూపించారు. లుక్ కొత్తది కాదు. కానీ, స్టిల్ కొత్తది. దాంతో పాటు విడుదల చేసిన కాప్షన్ కొత్తది. 'ప్రాజెక్ట్ కె' టీమ్ తమకు హ్యాండ్ ఇచ్చిందని ఫీల్ అవుతున్న ఫ్యాన్స్, ఈ పోస్టర్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదీ సంగతి! కొంత మంది ఫ్యాన్స్ ఈ అప్‌డేట్ మీద కూడా హ్యాపీగా లేరనుకోండి. అది వేరే విషయం.
''మర్యాద పురుషోత్తమ ప్రభు శ్రీరామ్'' అంటూ 'ఆదిపురుష్' చిత్ర బృందం ఈ లుక్ విడుదల చేసింది. రియల్ లైఫ్‌లో ప్రభాస్ డౌన్ టు ఎర్త్ అని... ఆయన అందరికీ మర్యాద, గౌరవం ఇస్తారని ఇండస్ట్రీ ప్రముఖులు చెబుతుంటారు. ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ''మర్యాద పురుషోత్తమ ప్రభాస్'' అంటూ అభిమానులు సంతోషిస్తున్నారు.
'ఆదిపురుష్' ప్రారంభమైనప్పటి నుంచి తాజాగా పుట్టిన రోజు స్టిల్ / పోస్టర్ విడుదల వరకూ... సినిమాకు సంబంధించిన ప్రతి అంశం వార్తల్లో ఉంటోంది. రామాయణం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో శ్రీరాముని పాత్రలో ప్రభాస్ (Prabhas) నటించారు. టీజర్ విడుదలైన తర్వాత ఆయన అభిమానులు, ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి. లుక్స్, గ్రాఫిక్స్ బాలేదని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.
Also Read : ప్రభాస్ 'నో' చెప్పడం నేర్చుకోవాలా? మొహమాటాలు వదిలేయకపోతే ఫ్లాప్స్ తప్పవా?
యూట్యూబ్‌లో సిల్వర్ స్క్రీన్ మీద త్రీడీలో 'ఆదిపురుష్'ను చూస్తే బావుంటుందని హీరో ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్, ఇతర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. టీజర్ విడుదల తర్వాత వచ్చిన ట్రోల్స్ ప్రభావంతో పలు థియేటర్లలో త్రీడీలో టీజర్ ప్రదర్శించారు. అప్పుడు విజువల్ గ్రాండియర్ కొంత వరకు ప్రేక్షకులకు తెలిసింది. అయితే... లుక్స్ మీద మాత్రం ఇంకా విమర్శలు వస్తున్నాయి. సినిమా విడుదలైన తర్వాత కంటెంట్ చూశాక ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటారని టీమ్ భావిస్తోంది. ఈతరం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుందని చెబుతోంది.
'ఆదిపురుష్'లో ప్రభాస్ సరసన సీత పాత్రలో కృతి సనన్ (Kriti Sanon), లక్ష్మణుడిగా సన్నీ సింగ్ (Sunny Singh), లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటించారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు 500 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందుతోంది. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగులో సంక్రాంతికి బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' కూడా విడుదల కానుంది.