ముంబై బ్యూటీ పూజాహెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇలా చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఈమెకి టాలీవుడ్ లో డిమాండ్ ఎక్కువే. అందుకే ఒక్కో సినిమాకి రెండున్నర కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అయితే సినిమా సినిమాకి తన రెమ్యునేషన్ ను పెంచుకుంటూ పోతుంది పూజాహెగ్డే.
ప్రస్తుతం ఈమె రెమ్యునరేషన్ రూ.5 కోట్లకు చేరుకుందట. పూరి జగన్నాథ్ లేటెస్ట్ సినిమాలో పూజాను హీరోయిన్ గా తీసుకున్నారు. దీనికోసం ఆమె ఐదు కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందట. ఇందులో నాలుగు కోట్లు పూజా రెమ్యునరేషన్ కాగా.. మరో కోటి రూపాయలు ఆమె పర్సనల్ స్టాఫ్ ఖర్చులు, జీతాలు. ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కాకుండా ఆమె చేతిలో త్రివిక్రమ్-మహేష్ సినిమా మాత్రమే ఉంది.
ఈ సినిమాకి కూడా ఇదే రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటుందని సమాచారం. అలానే పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కూడా పూజానే హీరోయిన్ అని టాక్. కానీ ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో క్లారిటీ లేదు. ఈ సినిమాలతో పాటు బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది పూజా. అందులో ఒకటి సల్మాన్ ఖాన్ సినిమా కావడం విశేషం.
తెలుగులో ఈమెకి కొత్త సినిమా అవకాశాలు వచ్చేలా కనిపించడం లేదు. ఇప్పటికే అగ్ర హీరోలందరి సరసన నటించేసింది. మన హీరోలు హీరోయిన్లను రిపీట్ చేయడానికి పెద్దగా ఇష్టపడరు. అప్పటికే మహేష్ బాబు లాంటి హీరోలు ఆమెని రిపీట్ చేస్తున్నారు. ఇక మిడ్ రేంజ్ హీరోల సరసన నటించడానికి పూజా రెడీగా ఉన్నా.. వారి బడ్జెట్ కారణంగా ఆమెని తీసుకునే అవకాశాలు లేవు. అందుకేనేమో పూజాహెగ్డే ఆఫర్లు తన చేతులో ఉన్నప్పుడే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది!
Also Read: బాలకృష్ణకు జోడిగా నటించిన హీరోయినే ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో విలన్‌గా?