ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయ జనతాపార్టీ నాయకులు పెద్ద పండుగలా జరుపుకుంటున్నారు.  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ,కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాందీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, తెలంగాణ సిఎం కెసిఆర్, ఎపి సిఎం జగన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు సినీ సెలబ్రెటీల నుంచి కూడా మోదీకి విషెస్ వెల్లువెత్తుతున్నాయి.


చిరంజీవి



గౌరవనీయులైన ప్రధాన మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..మన దేశ ప్రజలకు సుదీర్ఘకాలం పాటు సేవలందించడానికి మీరు ఆరోగ్యంగా, బలంగా ఉండాలని ట్విట్టర్లో పేర్కొన్నారు.


మహేశ్ బాబు






ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ‘గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ సమర్ధవంతమైన నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతూనే ఉండాలని కోరుకుంటున్నాం.ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి’ అంటూ ట్వీట్ చేశాడు.


నాగార్జున






మీ నాయకత్వంలో దేశాన్ని ఉన్నత స్థాయికి నడిపించండి. మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, మీకు జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేశాడు నాగార్జున.


రవితేజ



ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటూ బర్త్ డే విశెష్ చెప్పాడు మాస్ మహారాజ్ రవితేజ


మోహన్ బాబు



మీ అనుభవ సంపద ఎన్నో విధాలుగా మాపై సానుకూల ప్రభావాన్ని చూపింది. మీకు దీర్ఘాయుష్షు ఉండాలని కోరుకుంటున్నా అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు మోహన్ బాబు.


అభిషేక్ బచ్చన్



మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన అభిషేక్ బచ్చన్ మీరు ఆరోగ్యంగా ఉండాలని ట్వీట్ చేశాడు.


Also Read: బర్త్ డే స్పెషల్... ప్రధాని మోదీ తలపాగాల ప్రత్యేకత


ALso Read: ప్రధాని మోదీకి శుభాకాంక్షల వెల్లువ... 71వ వసంతంలోకి అడుగుపెట్టిన మోదీ.. ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు


Also Read: ఎవరీ విశ్వకర్మ..ఆయన జయంతిని ఎందుకు పండుగలా జరుపుకుంటారు…


Also read: శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తాం.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి