పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ 'హరిహర వీరమల్లు' అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. 2021 ఆరంభంలో సినిమా షూటింగ్ కూడా జరిగింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. రీసెంట్ గా మళ్లీ షూటింగ్ మొదలుపెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల కమిట్మెంట్స్ తో సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వస్తోంది.
ఇదొక పీరియాడికల్ సినిమా. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా ఖర్చు పెట్టారు. వేసిన సెట్లే మళ్లీ వేస్తూ.. అందరి కాల్షీట్స్ సర్దుబాటు చేసుకోవడం నిర్మాత ఏఎం రత్నంకి తలనొప్పిగా మారింది. ఇప్పుడు పవన్ ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నారు. ఆగస్టు నాటికి షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇదే విషయాన్ని దర్శకనిర్మాతలకు కూడా చెప్పినట్లు తెలుస్తోంది.
ఆగస్టులోగా తనపై తీయాల్సిన సన్నివేశాలను తీసుకోమని.. ఆ తరువాత వేరే సినిమాకి తన కాల్షీట్స్ ఇచ్చేస్తానని అన్నారట. తమిళ సినిమా 'వినోదయ సీతమ్' రీమేక్ లో నటించడానికి పవన్ అంగీకరించారు. సముద్రఖని ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఇందులో పవన్ తో పాటు సాయిధరమ్ తేజ్ కూడా నటించనున్నారు. మూడు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేయాలని పవన్ టార్గెట్ గా పెట్టుకున్నారు.
ఆ విధంగా 2022లో రెండు సినిమాలను పూర్తి చేయాలనేది పవన్ ఆలోచన. 2023 సంక్రాంతికి 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ కానుంది. వేసవిలో 'వినోదయ సీతమ్' రిలీజ్ వస్తుంది. 2023 జనవరి నుంచి హరీష్ శంకర్ సినిమా 'భవదీయుడు భగత్ సింగ్' సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతానికి పవన్ ఈ మూడు సినిమాలపై దృష్టి పెట్టనున్నారు. 2024 ఎలెక్షన్స్ సమయంలో పవన్ బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే కొత్త సినిమాలు కమిట్ అవ్వడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారట!
Also Read: మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ - 'సైన్యం' ఆగింది
Also Read: 'విక్రమ్', 'మేజర్' వల్లే అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్' ప్లాప్ అయ్యిందా? హీరోయిన్ మాటలు విన్నారా?