పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా సినిమాకి ఆయన రెమ్యునరేషన్ పెరగడమే కానీ తగ్గడం ఉండదు. రీఎంట్రీలో ఆయన నటించిన 'వకీల్ సాబ్'(Vakeel Saab) సినిమాకి రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలొచ్చాయి. నిజానికి ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఇచ్చిన కాల్షీట్స్ చాలా తక్కువ. అయినప్పటికీ నిర్మాత దిల్ రాజు రూ.50 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చాడంటే పవన్ క్రేజ్ ఏంటో అర్ధమవుతోంది. 


Also Read : Bigg Boss 5 Telugu : ముఖం పగిలిపోద్ది.. లోబోకి సిరి వార్నింగ్.. ఏడ్చేసిన ఆర్జే కాజల్..


'వకీల్ సాబ్' సినిమాకి కూడా బిజినెస్ అదే రేంజ్ లో జరిగింది. దీంతో పవన్ కి ఆ మాత్రం రెమ్యునరేషన్ ఇవ్వడం తప్పేమీ కాదని ప్రూవ్ అయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మైత్రి మూవీస్ బ్యానర్(Mythri Movie Makers)లో ఓ సినిమా చేయబోతున్నాడు. దీన్ని హరీష్ శంకర్(Harish Shankar) డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా కోసం పవన్ రూ.60 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారట. అంటే పవన్ పారితోషికాన్ని మైత్రి మరో పది కోట్లకు పెంచిందన్నమాట. 


Also Read : Bigg Boss Telugu 5 : బట్టలు లాకెళ్లిన బిగ్ బాస్.. అమ్మాయి డ్రెస్ లో రవి అరాచకం..


కాకపోతే.. 'వకీల్ సాబ్' సినిమాతో పోలిస్తే.. ఈ సినిమాకి పవన్ ఇంకొన్ని ఎక్కువ కాల్షీట్స్ ఇవ్వాల్సివస్తుంది. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని హరీష్ శంకర్ కి చెప్పారట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. వాటన్నింటినీ అనుకున్న ప్రకారం పూర్తి చేయాలి. హరీష్ శంకర్ మామూలుగానే చాలా త్వరగా సినిమాలు చేస్తుంటాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. పవన్ సపోర్ట్ చేస్తే గనుక సినిమాను వేగంగా పూర్తి చేసేస్తాడు. 


Also Read : Pan India Movies : దిల్ రాజు ప్లానింగ్.. నెక్స్ట్ రెండు నెలల్లో రచ్చ రచ్చే..


Also read: మళ్లీ తప్పులు చేస్తూనే ఉంటా అన్న సరయు..నచ్చలేదు డార్లింగ్ అన్న సన్నీ..మొదటి వారం నామినేషన్లలో రచ్చ


Avika Gor Photoshoot : 'చిన్నారి పెళ్లికూతురు' స్టన్నింగ్ ఫోటోలు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..


NTR30.. కొరటాల శివతో ఎన్టీఆర్ 30వ చిత్రం.. అప్‌డేట్ ఎప్పుడంటే..