పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం తను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నుంచి పక్కా ప్లానింగ్ ప్రకారం సినిమాలను పూర్తి చేయాలనుకుంటున్నారు. 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. ముందుగా అది 'తేరి' రీమేక్ అనుకున్నారు కానీ తరువాత ప్లాన్స్ మారినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా సుజీత్ ఓ కథను సిద్ధం చేసుకొని పవన్ కళ్యాణ్ కి వినిపించారు. 


Pawan Kalyan's next Launch News: ఆయనకు కథ నచ్చడంతో వెటనే ఓకే చెప్పేశారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 5న దసరా సందర్భంగా ఈ సినిమా పూజాకార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నారు. మరోపక్క సినిమాలో నటీనటులను ఎంపిక చేస్తున్నారు. డీవీవీ దానయ్య, త్రివిక్రమ్ కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాతో పాటు 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ లో కూడా పాల్గోనున్నారు పవన్. 


నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన ఒక వీడియోను రిలీజ్ చేశారు. అందులో కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి ముందు వర్క్ షాప్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో చాలా మంది నటులు, టెక్నీషియన్స్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ డైలాగ్స్ గురించి డిస్కస్ చేస్తుంటే.. క్రిష్ ఒక సన్నివేశం వివరిస్తూ కనిపించారు. ఇక వీడియో చివర్లో అక్టోబర్ మిడ్ నుంచి షూటింగ్ మొదలుకానుందని వెల్లడించారు. అందుతున్న సమాచారం ప్రకారం.. అక్టోబర్ 17 నుంచి షూటింగ్ మొదలవుతుందట. 


ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 50 రోజుల పాటు కాల్షీట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక 'హరిహర వీరమల్లు' సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్(Nidhi Aggerwal) కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి(Nargis Fakri) కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్(Megaproductions) పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ  భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


ఈ సినిమాలతో పాటు 'వినోదయ సీతం' రీమేక్ ఒప్పుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాను ఎప్పుడు మొదలుపెడతారో క్లారిటీ రావాల్సివుంది. అలానే 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా కమిట్ అయ్యారు పవన్. ఈ సినిమా స్క్రిప్ట్ చేతిలో పట్టుకొని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు హరీష్ శంకర్. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ తక్కువ డేట్స్ ఇచ్చినా.. షూటింగ్ పూర్తి చేస్తానని ఇప్పటికే హారీష్ శంకర్ మైత్రి మూవీ మేకర్స్ కి వెల్లడించారు. కానీ ఈ ప్రాజెక్ట్ గురించి పవన్ ఆలోచిస్తున్నట్లుగా లేరు. 


Also Read : వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా: పవన్‌పై బండ్ల గణేష్ ట్వీట్


Also Read : యాక్షన్ విత్ మెసేజ్, అంతా యునైటెడ్ కింగ్‌డ‌మ్‌లో - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు