పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో కలిసి పని చేయాలని చాలా మంది దర్శకనిర్మాతలు ఆశ పడుతుంటారు. ఇప్పటికే పవన్ చాలా సినిమాలను లైన్ లో పెట్టారు. అటు రాజకీయాలు, ఇటు సినిమాలు అంటూ చాలా బిజీగా గడుపుతున్నారు. ఆయన ఎంత బిజీగా ఉన్నా.. దర్శకులు కథలు చెప్పడం మాత్రం మానడంలేదు. తాజాగా మరో దర్శకుడు పవన్ కళ్యాణ్ కోసం కథ రాసే పనిలో పడ్డారు. ఆ దర్శకుడు మరెవరో కాదు పరశురామ్(Parasuram). 


Pawan Kalyan in talks with Mahesh Babu’s Director: మహేష్ బాబు(Mahesh Babu)తో 'సర్కారు వారి పాట' సినిమా తీసిన పరశురామ్.. ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమాను పట్టాలెక్కించలేదు. నాగచైతన్య(Naga Chaitanya)తో ఓ సినిమా చేయాలనుకున్నారు. 'నాగేశ్వరరావు' అనే టైటిల్ తో ఓ కథ కూడా రెడీ చేసుకున్నారు. చైతు కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. కానీ పరశురామ్ కంటే ముందుగా వెంకట్ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయ్యారు నాగచైతన్య. 


దీంతో పరశురామ్ కొంతకాలం ఎదురుచూడక తప్పనిసరి. దీంతో ఆయన మరో హీరో కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కోసం ఓ కథ రెడీ చేస్తున్నట్లు సమాచారం. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్(BVSN Prasad) ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి అడ్వాన్స్ ఇచ్చారు. పరశురామ్ కథ గనుక పవన్ కి నచ్చితే వీరి కాంబినేషన్ లో సినిమా గ్యారెంటీ. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నారు. కథ మొత్తం పూర్తయ్యాక పవన్ కి వినిపిస్తారు. మరి పరశురామ్ కి పవన్ ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి!


ఇక పవన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన 'హరిహర వీరమల్లు' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 50 రోజుల పాటు కాల్షీట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్(Nidhi Aggerwal) కథానాయికగా నటిస్తోంది. అలానే బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి(Nargis Fakri) కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్(Megaproductions) పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 


ఈ సినిమాలతో పాటు 'వినోదయ సీతం' రీమేక్ ఒప్పుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాను ఎప్పుడు మొదలుపెడతారో క్లారిటీ రావాల్సివుంది. అలానే 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా కమిట్ అయ్యారు పవన్. ఈ సినిమా స్క్రిప్ట్ చేతిలో పట్టుకొని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు హరీష్ శంకర్. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ తక్కువ డేట్స్ ఇచ్చినా.. షూటింగ్ పూర్తి చేస్తానని ఇప్పటికే హారీష్ శంకర్ మైత్రి మూవీ మేకర్స్ కి వెల్లడించారు. కానీ ఈ ప్రాజెక్ట్ గురించి పవన్ ఆలోచిస్తున్నట్లుగా లేరు. 


Read Also: ఈ సిరీస్ చూస్తే గజగజ వణకాల్సిందే! ఎక్కువగా ఉలిక్కిపడే సీన్లతో ‘ది మిడ్ నైట్ క్లబ్’ గిన్నిస్ రికార్డు!