సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో జరిగిన ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ తన స్పోర్ట్స్ బైక్ నుంచి కిందకు పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన ఆయన్ను నగరంలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చేర్పించి ట్రీట్మెంట్ అందించారు.
Also Read: రవితేజ డబుల్ ఇంపాక్ట్.. రష్మిక కొత్త లుక్..
ఈరోజు తేజు పుట్టినరోజు. పైగా దసరా.. ఈ సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేసింది మెగాఫ్యామిలీ. తేజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు చిరంజీవి వెల్లడించారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చెబుతూ సోషల్ మీడియాలో ఓ లెటర్ ను షేర్ చేశారు. అందులో ఏముందంటే..
''అనుకోని రీతిలో ప్రమాదం బారిన పడి గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిన సాయి ధరమ్ తేజ్ కోలుకొని ఈరోజు క్షేమంగా ఇంటికి చేరాడు. విజయ దశమి పర్వదినాన తేజ్ ఆరోగ్యంగా ఇంటికి రావడం మా కుటుంబం అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ రోజు తేజు పుట్టినరోజు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకొని ప్రేక్షకుల అభిమానాలు మరింతగా పొందాలను శక్తిస్వరూపిణిని ప్రార్థిస్తున్నాను. తేజ్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అభిమానులు ఎంతో బాధపడి.. తేజ్ క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. ఆలయాల్లో, ప్రార్థన మందిరాల్లో పూజలు చేశారు. వారందరి ప్రార్థనలు ఫలించాయి. ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'' అని తెలియజేశారు.
ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన 'భీమ్లా నాయక్' సినిమాలో నటిస్తున్నారు. అలానే 'హరిహర వీరమల్లు' సినిమా లైన్లో ఉంది. వీటితో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు.