సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 54 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. 

 

''తన ఆశ, ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కళ్యాణ్ బాబుకి  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను'' అంటూ మెగాస్టార్ చిరంజీవి విషెస్ చెప్పారు. 

 

''నా గైడింగ్ ఫోర్స్, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాబాయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు రాబోయే ఏడాది మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను'' రామ్ చరణ్ పోస్ట్ పెట్టారు. 

 

''హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్.. మీరు ఎప్పటికీ మంచి ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాను'' అంటూ మహేష్ బాబు విషెస్ చెప్పారు. 

 

''పవర్ ని తన ఇంటిపేరుగా చేసుకున్న నా స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మంచి ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను'' అంటూ రవితేజ విషెస్ చెప్పారు. 

 

''హ్యాపీ బర్త్ డే బాబాయ్! మీ ధర్మ మార్గం, సమాజం కోసం చేసే పని ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం'' అంటూ వరుణ్ తేజ్ పోస్ట్ పెట్టారు. 

 

''హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ సార్. మీ విజయాలు, మాటలు చాలా మందికి గొప్ప ప్రేరణ. మీతో పనిచేసినందుకు సంతోషంగా ఉంది సార్. ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను'' అంటూ కీర్తి సురేష్ ట్విట్టర్ లో రాసుకొచ్చింది. 

 

''కొన్ని సార్లు రావడం లేట్ అవ్వొచ్చు కానీ రావడం పక్కా.. హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్'' అంటూ హరీష్ శంకర్ విషెస్ చెప్పారు. 

 


పవన్ ఫ్యాన్స్ కి బర్త్ డే గిఫ్ట్: 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పీరియాడికల్ ఫిక్షన్ ఫిల్మ్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈరోజు పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పవర్ గ్లాన్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నిమిషం నిడివి ఉన్న ఈ పవర్ గ్లాన్స్‌లో.. పవర్ స్టార్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. మల్లయోధులతో పవన్ కల్యాణ్ కుస్తీకి సై అంటూ.. తొడగొట్టి మరీ పోరాటానికి దిగుతారు. మీసం మెలేస్తూ ఒక్కొక్కరినీ తన చేతులతో మట్టి కరిపిస్తారు. అలీవ్ గ్రీన్ కుర్తా పైజామా మెడ చుట్టూ ఎరుపు రంగు కండువాతో నడిచి వచ్చే ఆ సీన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంది. ఇక బ్యాగ్రౌండ్ లో వచ్చే ''దిగొచ్చిండు భళ్ళు భళ్ళునా. పిడుగే దిగొచ్చింది భళ్లు భళ్లునా.. మెడల్ని వంచి, కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పనెట్టుకొని తొడకొట్టాడో.. తెలుగోడు'' అనే పాట మైండ్ నుంచి బయటకు పోదు.