Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ముంబయిలో ఓ రెస్టరెంట్ ప్రారంభించనున్నారు. లెెజెండరీ సింగర్ కిషోర్ కుమార్ బంగ్లాలో ఈ రెస్టరెంట్ ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కిషోర్ కుమార్ తనయుడు అమిత్ కుమార్ ఓ వార్తా సంస్థకు తెలియజేశారు.
దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రెండో ఇన్నింగ్స్ కు కోహ్లీ రెడీ అవుతున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆప్షన్ బీ ను సిద్ధంగా ఉంచుకుంటున్నాడంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల విరాట్ కోహ్లీ క్రికెట్ లో ఫామ్ కోల్పోయి పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఆసియా కప్ లో కోహ్లీ ఆడుతున్నాడు.